మీరు అంటే ఒప్పు..మేంటే తప్పా? : నాగబాబు

siri Madhukar
గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో మెగా వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ మద్య రగడ మొదలైంది.  దానికి కారణంగా ఇటీవల మెగాబ్రదర్ నాగబాబు ఓ యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇస్తూ తనకు బాలయ్య అంటే ఎవరో తెలియదని అన్నారు..ఆ తర్వాత బాలయ్య అంటే సినియర్ నటులు బాగా తెలుసని..ఆయన గొప్ప నటులు అని అన్నారు.  ఆ తర్వాత బాలకృష్ణ గురించి చెప్పడం మర్చిపోయానని ఆయన గొప్ప కమెడియన్ అని అన్నారు. అంతే కాదు పాత తరం హాస్య నటులు బాలకృష్ణ ఫోటో చూపించారు.  


అప్పటికే నందమూరి ఫ్యాన్స్ రగిలిపోతుంటే..ఈ కామెంట్స్ చూసి మరింత రెచ్చిపోయారు.  అప్పటి నుంచి నాగబాబు ని టార్గెట్ చేసుకొని ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు.  ఇలా కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వివాదం కొనసాగుతూనే ఉంది. అంతే కాదు ఆ మద్య నాగాబాబు స్పీచ్ ఇస్తున్న సమయంలో జై బాలయ్య అంటూ నినాదాలు చేసి ఆ సభలో రగడ చేశారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు ఆ విమర్శలు ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చాడు అంతేకాదు ఈ తప్పులకు కారకుడు బాలయ్య అంటూ నేరుగా బాలయ్య మీదే నెట్టేశాడు. 


 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ఎంతగానో సహకరించాడు.  తాను ఒక్క సీటు కూడా ఆశించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకులు అని ఆయనకు మద్దతు పలికారు.  కాగా అలాంటి నా తమ్ముడ్ని పవన్ కళ్యాణ్ ఎవరో తెలీదు అని అన్నారు అక్కడ చాలా హర్ట్ అయ్యాను , అలాగే గడిచిన నాలుగైదేళ్ల లో మా కుటుంబం పై రకరకాల కామెంట్స్ చేసారు అందుకే ఇలా రియాక్ట్ కావాల్సి వచ్చింది.  నేను అంటే మీకు బాధ కలిగినప్పుడు మీరు అన్నప్పుడు మాకు బాధ ఉండదా ? ఓ వీడియో రిలీజ్ చేశారు నాగబాబు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: