మామగారు కాబోతున్న వెంకటేష్...నాయుడు గారింట త్వరలో పెళ్ళి బాజాలు !!

frame మామగారు కాబోతున్న వెంకటేష్...నాయుడు గారింట త్వరలో పెళ్ళి బాజాలు !!

Satya
విక్టరీ వెంకటేష్ అంటేనే ఫ్యామిలీ హేరోగా తెలుగు జనాలకు తెర పరిచితుడు. మిగిలిన హీరోల మాదిరిగా ఆయన మీడియాకు అందడు, కేవలం తన సినిమాలూ తానేంటో మాత్రమే చూసుకునే కాం గోయింగ్ పర్సనాలిటీ. ఆయన ప్రైవేట్ లైఫ్ గురించి ఎవరికీ అసలు తెలియదు. కుటుంబాన్ని సినిమాను వేరు చేసి చూడడంతో ఆయన శోభన్ బాబుని ఆదర్శంగా తీసుకున్నట్లు కనిపిస్తారు. అటువంటి వెంకీ ఇంటికి సంబంధిచి హాట్ హాట్ మ్యాటర్ ఒకటి లేటేస్ట్ గా బయటకు వచ్చింది.


కుమార్తె ప్రేమకు ఒకే :



వెంకటేష్ ఓ పద్ధతి ప్రకారం నడిచే మనిషిగా ఇండస్ట్రీ చెప్పుకుంటుంది. ఆయన చాల ప్రిన్శిపుల్స్ మైంటైన్ చేస్తారని సన్నిహితుల మాట. ఆయక పెద్ద కుమార్తె ఆశ్రిత ప్రేమ వివాహాన్ని వెంకీ ఒకే చేశారని తాజా టాక్. అశ్రిత ప్రొఫెషనల్ బేకర్. బేకరి రంగంలో వృత్తి నిపుణురాలిగా శిక్షణ తీసుకున్నారు. ఇన్ ఫినిటీ ప్లేటర్ పేరుతో హైదరాబాద్ నగరంలో పలు స్టాల్స్ ని నిర్వహిస్తున్నారు. రామానాయుడు స్టూడియోస్ లోనూ ఈ తరహా స్టాల్ ఒకటి నిర్వహణలో ఉంది.ఆశ్రిత ప్రేమించిన యువకుడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్నేహితుడు రఘురామి రెడ్డి కుమారుడు - సురేందర్ రెడ్డి మనవడు అని తెలుస్తోంది. ఈ పెళ్ళికి వెంకీ ఒకే చెప్పడం ద్వారా తాను రియల్  హీరో అనిపించుకున్నారు.


తొందరలోనే పెళ్ళి  బాజాలు :



వెంకటేష్ ప్రస్తుతం ఎఫ్-2 చిత్రీకరణ కోసం ప్రేగ్ వెళ్లారు. అక్కడ చిత్రీకరణ ముగించుకుని త్వరలో తిరిగి హైదరాబాద్ కి విచ్చేస్తున్నారు. వెంకీ రాగానే అశ్రిత నిశ్చితార్థ వేడుక ఉంటుందని తెలుస్తోంది. ఈ లోగా ఆయన సోదరుడు సురేష్ బాబు వరుడు ఇంటికి వెళ్ళి పెళ్ళి మాటలు మాట్లాడారని టాక్. ఆయన సోదరుడు సురేష్ బాబు వరుడు ఇంటికి వెళ్ళి పెళ్ళి మాటలు మాట్లాడారని టాక్. హైదరాబాద్ రేస్ క్లబ్ ఛైర్మన్ ఆర్.సురేందర్ రెడ్డి మనవడితో మూడు ముళ్ళూ వేయించుకోవడానికి వెంకీ కూతురు రెడీ అవుతోందన్న మాట. చూద్దాం ఆ ముచ్చట 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: