భారత దేశంలో క్రికెట్ అంటే ఎంతగా అభిమానిస్తారో అందరికీ తెలిసిందే. ఇక క్రికెట్ దేవుడిగా సచిన్ టెండూల్కర్ ని అభివర్ణిస్తారు. ప్రస్తుతం ఆ స్థాయిలో మెయింటేన్ చేస్తున్న క్రికెటర్ ఒక్క విరాట్ కోహ్లీ అని చెప్పొచ్చు. మొదటి నుంచి దూకుడుగా ఆడుతూ..ఎక్కడా తడబడకుండా సెంచరీలు..ఆఫ్ సెంచరీలు బాదేస్తుంటాడు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం టీమ్ ఇండియా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ మద్య కొంత కాలంగా ప్రేమించిన బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను పెళ్లి చేసుకున్నాడు. అయితే క్రికెటర్లు సినీ ఇండస్ట్రీలో కూడా రాణిస్తున్నారు.
తాజాగా ఇప్పుడు విరాట్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడా అంటే..అవుననే అనుమానాలు వస్తున్నాయి. అతడు తాజాగా చేసిన ట్వీట్ లో ఏదో మూవీ పోస్టర్‌లాగా ఉన్న ఆ ఫొటోలో కోహ్లి ఓ సూపర్ హీరోలా కనిపిస్తున్నాడు. ఇప్పుడీ ఫొటోనే ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న ఏషియకప్‌కు దూరంగా ఉన్న విరాట్.. సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే విరాట్ భార్య అనుష్క సినిమాల్లో కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాను కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.
ఆ పోస్టర్‌పై ఇంట్రడ్యూసింగ్ విరాట్ కోహ్లి.. ట్రైలర్ ద మూవీ అని రాసి ఉండటం విశేషం. ఇక ఈ ఫొటోని షేర్ చేస్తూ పదేళ్ల తర్వాత మరో అరంగేట్రం చేస్తున్నాను.. వెయిట్ చేయలేకపోతున్నాను అని కోహ్లి కామెంట్ చేశాడు. క్రికెట్ లో తన పవర్ చూపించిన కోహ్లీ ఇండస్ట్రీలో కూడా తన సత్తా చూపించబోతున్నాడన్నమాట. కోహ్లి నిజంగానే సినిమాల్లోకి వస్తున్నాడంటే అభిమానులకు పండుగే. నిజానికి అతను కూడా హీరో మెటీరియలే. ఆటతోనే కాదు లుక్స్‌లోనే విరాట్ అదరగొడతాడు. మొన్నా మధ్య భార్య అనుష్క శర్మతో కలిసి మాన్యవర్ యాడ్‌లోనూ అతడు నటించాడు.
Another debut after 10 years, can't wait! 😀 #TrailerTheMovie https://t.co/zDgE4JrdDT pic.twitter.com/hvcovMtfAV
— Virat Kohli (@imVkohli) September 21, 2018