ఫినాలేకి చేరుకున్న సామ్రాట్..కౌశల్..గీతా టాస్క్ సూపర్!

frame ఫినాలేకి చేరుకున్న సామ్రాట్..కౌశల్..గీతా టాస్క్ సూపర్!

siri Madhukar
బిగ్ బాస్ సీజన్ 2 దగ్గర పడుతున్న నేపథ్యంలో హౌజ్ సభ్యులు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఇక బిగ్ బాస్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే సందడి మొదలైంది. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న 6 మందిలో ఒకరు ఫైనల్‌కి చేరుకున్నారు.  బిగ్ బాస్ సీజ‌న్ 2 కార్య‌క్ర‌మం తుది ద‌శ‌కు చేరుకోవ‌డంతో ఇంటి స‌భ్యులు త‌మ ఆటల‌తో ప్రేక్ష‌కులని ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు. మూడు రోజులుగా హీటెక్కిన బిగ్ బాస్ హౌజ్‌ ఎపిసోడ్ 103లో కాస్త చ‌ల్ల‌బ‌డిన‌ట్టు క‌నిపించింది.   ఈ టాస్క్‌లో బిగ్ బాస్ ఆ ఇద్ద‌రి కంటెస్టెంట్స్‌కి బౌల్ లో కోడిగుడ్లు ఇచ్చారు.

బౌల్‌లో ఉన్న కోడిగుడ్ల‌ని గేమ్‌లో పాల్గొన్న‌ ఇద్ద‌రు స‌భ్యులు ప‌గ‌ల‌గొట్ట‌కుండా చూసుకోవాలి. టాస్క్‌లో భాగంగా మిగ‌తా ఇంటి స‌భ్యులు ఒక‌రికి మ‌ద్ద‌తు తెలుపుతూ మ‌రొక‌రివి ప‌గ‌ల‌గొట్టొచ్చ‌ని అన్నారు.  చివరిగా ఎవరి బౌల్‌లో ఎక్కువ గుడ్లు పగలకుండా ఉంటాయో వాళ్లే డైరెక్ట్‌గా ఫినాలేకి వెళ్తారంటూ బిగ్ బాస్ ఈ టాస్క్ ఇచ్చారు.  అయితే నిన్నటి ఎపిసోడ్‌లో కౌశల్.. తనను కుక్కతో పోల్చడంతో గుక్కపెట్టి ఏడ్చిన రోల్‌కి ఈ టాస్క్‌లో అండగా నిలబడ్డాడు కౌశల్. ఈ వారాంతం వరకు వీరి మద్య గొడవ ఎక్కువ అవుతుందనుకున్న సమయంలో కౌశల్ తన మద్దతు రోల్ రైడా కు ఇవ్వడం ఒకింత ఇంటి సభ్యులకు కూడా ఆశ్చర్య కలిగించింది. 

దీప్తి, తనీష్, గీతా మాధురిలు సామ్రాట్‌కి మూకుమ్మడిగా మద్దతు తెలిపడంతో రోల్ రైడా ఒంటరివాడయ్యాడు. దీంతో రోల్ అభ్యర్ధన మేరకు తనకు అండగా నిలబడి చివరి వరకూ తనీష్, దీప్తి, గీతా మాధురితో తలపడ్డాడు కౌశల్.  రోల్ ద‌గ్గ‌ర ఉన్న గుడ్ల‌ని ప‌గ‌ల‌గొట్టేందుకు త‌నీష్‌, గీతా, దీప్తిలు చాలా ప్ర‌య‌త్నించగా కొంత వ‌ర‌కు వారిని కౌశ‌ల్ అడ్డుకున్నాడు. కాని బెడ్ రూంలోకి వెళ్ళిన త‌ర్వాత అంద‌రు ఒకే సారి రోల్‌పై ఎటాక్ చేయ‌డంతో ఆయ‌న చేతిలో ఉన్న గుడ్లు అన్ని ప‌గిలిపోయాయి. దీంతో రోల్‌, కౌశ‌ల్‌లు సామ్రాట్ బౌల్‌లో ఉన్న ఎగ్స్ ని పగుల‌గొట్టేందుకు ప్ర‌య‌త్నించారు.

రోల్ తన గుడ్లు పగిలిపోవడంతో ఇక సామ్రాట్ గెలుపు కోసం ఒకే చేశాడు.  అయితే ఇప్పటి వరకూ నీ తరుపున చాలా రిస్క్ చేసి నిలబడితే నువ్.. ప్రయత్నించకుండా సామ్రాట్‌కి మద్దతు తెలపడం ఏంటి అంటూ కౌశల్ ప్రశ్నించాడు. మిగిలిన సభ్యుల సంగతి పక్కన పెట్టు నీకు సామ్రాట్ గెలవాలని ఉందా అని రోల్ అడగడంతో అవునని సమాధానం ఇవ్వడంతో గేమ్‌ని వదిలేశాడు కౌశల్.  మొత్తానికి సామ్రాట్ గ్రాండ్ ఫినాలేకి చేరడంతో నాటకీయత చాలానే కనిపించింది. 

ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కి టాస్క్ ఇచ్చారు. ఇందులో ఇంటి స‌భ్యులు మూడు గ్రూపుల‌గా విడిపోయి ప్ర‌క‌ట‌న చేయాల‌ని అన్నారు. ఈ ప్ర‌క‌ట‌న ఫన్నీగా ఉండాల‌ని అన్నారు. ముందుగా సామ్రాట్‌, దీప్తిలు త‌మ స్టైల్‌లో యాడ్‌ని ప్ర‌మోట్ చేయ‌గా ఆ త‌ర్వాత త‌నీష్‌, రోల్‌లు వ‌చ్చారు. చివ‌ర‌కి కౌశ‌ల్‌, గీతా మాధురిలు ప్ర‌క‌ట‌న కోసం భార్య భ‌ర్త‌లుగా మారి స్కిట్‌ని ర‌క్తి క‌ట్టించారు.  దాంతో బిగ్ బాస్ కౌశల్, గీతామాధురి ని విన్నర్ గా ప్రకటించి అప్రిషియేట్ చేశాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: