ఏంటా వరుసలు...మార్చండయ్యా బాబూ : యాంకర్ సుమ

frame ఏంటా వరుసలు...మార్చండయ్యా బాబూ : యాంకర్ సుమ

siri Madhukar
ఈ మద్య చాలా మంది సెలబ్రెటీలో తమ అభిమానులతో లైవ్ లో చిట్ చాట్ చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ విషయంలో బుల్లితెర, వెండితెర, క్రీడా రంగానికి చెందిన వారు ఎంతో మంది తమ ఫ్యాన్స్ తో లైవ్ లో చిట్ చాట్ చేస్తు వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటున్నారు.  తాజాగా తెలుగు టెలివిజన్ లో యాంకర్ సుమ కు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.  కేరళా నుంచి వచ్చిన సుమ అచ్చమైన..స్వచ్చమైన తెలుగు అమ్మాయిగా తన యాంకరింగ్ తో ఎంతో మంది హృదయాలు కొల్లగొట్టింది.

ఎన్నో టీవి కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఎన్నో ఆడియో వేడుకల్లో తన యాంకరింగ్ తో సినీ నటులను సైతం అబ్బుర పరుస్తుంది.  తాజాగా యాంకర్ సుమ అభిమానులతో లైవ్ చాట్ చేశారు. ఇందులో అభిమానులతో కాసేపు ముచ్చటించారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలు ఇస్తూ వచ్చారు.  ఆ సమయంలో ఓ నెటిజన్ ‘అక్కా మీరు రాజీవ్ అన్నతో కలిసి ఓ సినిమాలో నటిస్తే చాలా బాగుంటుంది’ అంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు. 

అంతే సుమా ఒక్కసారే హలో.. 'ఏమిటా వరసలు..? ముందు వరసలు మార్చు.. పిలిస్తే నన్ను వదినా అని పిలవండి, ఆయన్ని అన్నయ్య అని పిలవండి..లేదా నన్ను అక్కా అనండి..ఆయన్ని బావా అనండి..అంతే కాదు వరుసలు మరీ ఇంత ఘోరంగా మారుస్తారేం..అన్నారు.    రాజీవ్ తో సినిమా చేస్తే చూడాలనుందా..? ఈ విషయం రాజీవ్ ని అడిగా చెప్తా అంటూ వ్యాఖ్యానించింది. ఇక అభిమానులందరికీ త్వరలోనే ఓ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నానని,. అదేంటో ఇప్పుడే చెప్పనని.. ఈ ఏడాది చివర్లో చెబుతానని వెల్లడించింది. ఇదిలా ఉంటే త్వరలో సుమ వెండితెరపై కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: