కవలపిల్లలకు జన్మనిచ్చిన ప్రిన్స్ హీరోయిన్!

frame కవలపిల్లలకు జన్మనిచ్చిన ప్రిన్స్ హీరోయిన్!

siri Madhukar
టాలీవుడ్ లో కౌబాయ్ నేపథ్యంలో  మహేష్ నటించిన ‘టక్కరిదొంగ’ సినిమాలో హీరోయిన్ గా నటించిన అందాల భామ లిసారే అందరికీ గుర్తుండే వుంటుంది.   క్యాన్సర్‌ను జయించిన ఈ భామ...తన ప్రియుడైన జాసన్ దేహ్నిని పెళ్లాడిన విషయం తెలిసిందే.  తాజాగా లీసారే...ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మినిచ్చింది. ఆ కవలలను ఆమె సరోగసి ద్వారా పొందింది. ప్రస్తుతం తన కవలపిల్లలతో జార్జియాలో వున్న ఆమె ఇండియాకు రాగానే, ఆ చిన్నారులిద్దరినీ మనకు పరిచయం చేస్తుందట.  


2009 లో లిసారే కేన్సర్ బారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. చికిత్స అనంతరం తనకు క్యాన్సర్ నయం అయిందని 2010 లోప్రకటించింది. టక్కరిదొంగ సినిమా తప్పించి తెలుగులో మళ్లీ కనిపించలేదు.  కాకపోతే బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించింది.  2012లో జాసన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పింది. లిసారాయ్‌కు పెళ్ళి అయింది గానీ సంతానం కలగలేదు. దీంతో లిసారాయ్ దంపతులు సంతానం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. చాలా ఏళ్ళ తర్వాత ఆమె కల నెరవేరింది. 

ఇప్పుడు తన 46వ ఏట మాతృత్వపు వరాన్ని పొందింది..అది కూడా ఇద్దరు కవలలు.  క్యాన్సర్ బారిన పడిన దగ్గర నుంచి తల్లయ్యేంత వరకూ అన్ని విషయాలను తెలియజేస్తానని చెప్పింది. రోగాల బారిన పడినంత మాత్రాన జీవితాన్ని కోల్పోయినట్టు కాదని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని సందేశం ఇస్తోంది. ఈ విషయాన్ని క్యాన్సర్ బారిన పడిన బాధితులకు తెలియజేసి వారికి అండగా ఉంటాననని చెప్పింది. 


కూతుళ్ల రూపంలో తన భర్త తనకు గొప్ప బహుమతి ఇచ్చాడని లీసారే కొనియాడింది. అంతే కాదు  సరోగసివిధానంపై జనాల్లో అనేక అపోహలు ఉన్న సంగతి తెలిసిందే. సరోగసి ద్వారా పిల్లలు అంటే విచిత్రంగా చూస్తారు.‘సరోగసీ గురించి వున్న భ్రమలను తొలగించుకుని, అంతా అవగాహన ఏర్పరుచుకోవాలని అంటుంది.  కూతుళ్లతో ఉన్న లీసారే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: