యాంకర్ సుమ దంపతులు మంచి మనసు చాటుకున్నారు!
భారత దేశంలో కేరళా అంటే సుందరమైన ప్రదేశం అంటారు..పర్యాటకులను ఆకట్టుకోవడంలో కేరళా ఎప్పుడూ ముందుంటుంది. అలాంటి కేరళాకు వరదల రూపంలో అపార నష్టం వాటిల్లింది. ప్రకృతి ప్రకోపాలని కేరళ తల్లడిల్లిపోయింది. భారీ వదలు కేరళను ముంచెత్తాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుని పోయాయి. కొన్ని ఇళ్లు కళ్ల ముందే పేకమేడల్లా కూలిపోయాయి. గ్రామాలు, పట్టణాళను వరదనీరు ముంచెత్తింది. ప్రకృతి ప్రకోపానికి సుమారు 400 వందల మంది ప్రాణాలు కోల్పోగా వందల మంది గాయపడ్డారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. జాతీయ విపత్తు నివారణ సంస్థతో పాటుగా ఆర్మీ,నేవీ,ఎయిర్ ఫోర్స్ దళాలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొని తమ వంత సహకారాన్ని అందించారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా కేరళలో భారీ ఆస్తినష్టం జరిగింది, పంటలు నీట మునిగాయి, పెద్ద ఎత్తున రబ్బర్,కొబ్బరి, సుగంధ ద్రవ్యాల తోటలు నేలమట్టం అయ్యాయి. వంతెనలు కొట్టుకొని పోగా ఇళ్లు కూలిపోయాయి. కేరళా కష్టాన్ని చూసి ప్రపంచ దేశాల్లో ఉన్న కేరళా వాసులు తమ వంతు సహాయాన్ని అందించారు. కేరళా ప్రజలను ఆదుకోవడానికి సినీ, రాజకీ, క్రీడా,పారిశ్రామిక రంగానికి చెందిన వారు విరాళాలు ఇచ్చారు..తమకు తోచిన సహాయ సహకారాలు అందించారు.
తాజాగా కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రముఖ యాంకర్ సుమ-నటుడు రాజీవ్ కనకాల దంపతులు ముందుకొచ్చారు. సుమ దంపతులు అలిప్పి జిల్లాలోని కున్నుమ్మ ప్రాంతంలో శిథిలావస్థకు చేరిన ఆరోగ్య సంక్షేమ కేంద్రాన్ని కూల్చేసి దాని స్థానంలో కొత్తది నిర్మించాలని నిర్ణయించారు. అంతే కాదు ఈ విషయం గురించి కేరళ ఆరోగ్య మంత్రి థామస్ ఐజాక్తో మాట్లాడారు. తమ వంతు సాయంగా ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించాలనుకుంటున్నట్టు చెప్పారు.
ఈ సందర్భంగా సుమ దంపతులు మాట్లాడుతూ..మేం చేసేది చిన్న సహాయం..కానీ అక్కడ వరదల్లో చిక్కుకొని అనారోగ్యంతో బాధపడే వారికి కొంత ధైర్యం ఉంటుందని..సరైన వసతులు ఏర్పాటు చేసిన ఆస్పత్రి ఉంటే అక్కడి ప్రజలకు ధైర్యం ఉంటుందని భావించాం..అందుకే ఆసుపత్రి కట్టించడానికి తమ వంతు కృషి చేస్తున్నామని అన్నారు. భవన నిర్మాణానికి ఎంత ఖర్చయినా భరిస్తామని తెలిపారు.