జూనియర్ వైబ్రేషన్స్ పై నమ్మకం పెట్టుకున్న రమాప్రభ !

Seetha Sailaja
సీనియర్ నటి రమాప్రభ ఈమధ్య మీడియా వార్తలలో తెగ కనిపిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు అనేక సినిమాలలో నటిస్తూ చాల బిజీ ఆర్టిస్ట్ గా పేరు గాంచిన ఈమె పేరు కూడ ఇప్పటి తరం ప్రేక్షకులకు తెలియని పరిస్థితి. 

ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందుల మధ్య సతమతమైపోతున్న రమా ప్రభ ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత ఆర్ధిక పరిస్థుతుల పై అదేవిధంగా ఇండస్ట్రీలోని చాలామంది వ్యక్తిత్వం పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తనకు పూరి జగన్నాథ్ అక్కినేని నాగార్జున ఆర్థికసాయం చేస్తున్న విషయాలను వివరిస్తూ ఒకప్పుడు సకల వైభోగాలతో ఉన్న తాను ఇప్పుడు ఏమీలేని స్థాయికి తాను ఎలా వచ్చిందో వివరించింది.

ఈ సందర్భంలో ఆమె జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. తాను జూనియర్ ను కలవాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న విషయాలను వివరిస్తూ తనకు జూనియర్ లో నచ్చే విషయాలను వివరించింది. జూనియర్ లో చాలా పరిణతి కనిపించడమే కాకుండా అతడిలోని తాత్విక లక్షణాలు తనకు చాల ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది రమాప్రభ. 

ఇదే సందర్భంలో ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ ను కలవడానికి మధ్యవర్తి ఎవరూ అవసరం లేదని ఆమె కామెంట్ చేయడమే కాకుండా ‘‘ఎన్టీఆర్ ను కలవాలని ఎవరికీ చెప్పక్కర్లేదు. ప్రకృతే కలిపిస్తుంది. మధ్యవర్తి ఉండకూడదు. ప్రకృతి సంబంధిత విషయాలకు మధ్యవర్తి అవసరం లేదు. శూన్యమని ఒకటి అంటారు. వైబ్రేషన్ కలిపిస్తుంది. అది నా నమ్మకం. అది జరగడానికి దేవుడు స్వామి అవ్వక్కర్లేదు. మన సంకల్పం పాజిటివ్ గా ఉంటే అది జరుగుతుంది జరిగి తీరుతుంది’’ అంటూ ఒక వేదాంతిలా కామెంట్ చేసింది. మరి జూనియర్ లో ఆమె చూసిన ఆ వైబ్రేషన్ ఎంత వరకు తారక్ తో సినిమాలు తీస్తున్న వారు గ్రహించారో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: