రిలీజ్ కి సిద్దమైన ‘విజేత’టీజర్!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా హీరోలు ఎంట్రీ ఇచ్చారు.  ఇప్పటి వరకు ఎంట్రీ ఇచ్చిన హీరోలు ఎవరికీ ఎవరూ పోటీ లేకుండా తమ సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో అభిమానం సంపాదించారు.  పవన్ కళ్యాన్ తర్వాత అల్లు అర్జున్, రాంచరణ్ లు హీరోలుగా మంచి ఫామ్ లో ఉండగా..మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్, మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.  తాజాగా మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాన్ దేవ్ హీరోగా  ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే.

త్వరలోనే ‘విజేత’గా మన ముందుకు రాబోతున్నారు. ఇటీవలె విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. సాయి కొర్రపాటి నిర్మాణంలో .. రాకేశ్ శశి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. మాళవిక నాయర్ కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి ఇటీవలే ఫస్టులుక్ వదిలారు. కల్యాణ్ దేవ్ లుక్ పట్ల అందరూ సంతృప్తిని వ్యక్తం చేశారు.

మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌లో ఓ మైలురాయి చిత్రమైన విజేత సినిమా టైటిల్‌ను ఈ సినిమాకు పెట్టడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా విజయవంతమై కళ్యాణ్‌ దేవ్‌ను బాక్సాఫీస్‌ వద్ద విజేతగా నిలబెడుతుందో లేదో వేచి చూడాలి.  ఈ సినిమాకు సినిమాటోగ్రఫర్‌ : సెంథిల్‌కుమార్‌, నిర్మాత : రజనీ కొర్రపాటి, మ్యూజిక్‌ : హర్షవర్థన్‌ రామేశ్వర్‌.
Teaser of #Vijetha marking the debut of #KalyaanDhev will be out on June 12th at 8:59 am. A film by @rakeshsashii under #SaiKorrapati Production

|@vaaraahicc. @iamMalavikaNair @DOPSenthilKumar @murlisharma72 #HarshavardhanRameshwar |#VijethaTeaser pic.twitter.com/TDOjoZMEYI

— BARaju (@baraju_SuperHit) June 11, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: