ఆశలు వదులుకున్న కార్తీక

Prasad
ఒకప్పటి హిట్ హీరోయిన్ రాధ కుమార్తె కార్తీక సినిమా రంగంలో ప్రవేశించిన సంగతి తెలిసిందే. జోష్ సినిమాతో పరిచయమైన కార్తీక తరువాత కొన్ని సినిమాల్లో నటించింది. అయితే ఆశించిన గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. కాగా, కార్తీక త్వరలో లండన్ వెళ్తుందట. అక్కడ ఆర్థిక శాస్త్రంలో పాఠాలు నేర్చుకుంటుందట. మా ఫ్యామిలీకి హోటల్ బిజినెస్ లు ఉన్నాయని, భవిష్యత్ లో వాటిని నిర్వహించాలంటే తనకి పాఠాలు తప్పనిసరని కార్తీక చెబుతుంది. దీంతో కార్తీక పరిస్థితిని అర్థం చేసుకుందని, ఇక సినిమా చాన్సుల మీద కార్తీక ఆశలు వదలుకుందని అందుకే బిజినెస్ రంగం వైపు కాలు పెడుతుందని కామెంట్లు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: