హీరోయిన్లను ప్రోత్సహించే విక్రమ్

Prasad
శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు సినిమా విక్రమ్ కెరీర్ లో అత్యంత బిగ్గెస్ట్ హిట్. వీరి కలయికలో మళ్లీ ఐ అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఏమీ జాక్సన్ ఒక హీరోయిన్ గా నటిస్తుంది. కాగా, ఇటీవల విక్రమ్ మాట్లాడుతూ ఏమీ జాక్సన్ పై పొగడ్తలు గుప్పించాడు. ఏమీ జాక్సన్ మంచి నటని, ఏ డ్రెస్ కు అయినా సరిపోయే అందమైన ఫిజిక్ ఏమీ జాక్సన్ సొంతమని విక్రమ్ ప్రశంసించాడు. ఈ మాటలకు స్పందించిన ఏమీ జాక్సన్ విక్రమ్ ను ఆకాశానికి ఎత్తేసింది. విక్రమ్ అద్భుతమైన నటుడని, సహా నటుల్లోని ప్రతిభ వెలికి తీస్తారని, ముఖ్యంగా హీరోయిన్లను ప్రొత్సహించడంలో విక్రమ్ ముందుంటాడని ఏమీ జాక్సన్ కితాబిచ్చింది.  కాగా, విక్రమ్-ఏమీ జాక్సన్ లమద్య సమథింగ్.. సమథింగ్ అంటూ తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: