బిగ్ బాస్ అలా కలిసి వచ్చింది..!

frame బిగ్ బాస్ అలా కలిసి వచ్చింది..!

Edari Rama Krishna
తెలుగు బుల్లితెరపై మొట్టమొదటి సారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన ‘బిగ్ బాస్’ షో కి ఎంతో మంది ఫ్యాన్స్ అయ్యారు.  70 రోజులు   హోరా హోరీగా జరిగిన ఈ పోరులో శివబాలాజీ బిగ్ బాస్ సీజన్ 1 టైటిల్‌తో పాటు 50 లక్షల ఫ్రైజ్ మనీ గెల్చుకున్నారు. బిగ్ బాస్ లో షో లోకి దీక్షా పంత్, నవదీప్ లు  వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చారు.  అయతే దీక్ష మాత్రం మద్యలో వెళ్లిపోయినా..చివరి వరకు నవదీప్ కొనసాగారు. ఇక బిగ్ బాస్ పుణ్యమా అని కొంత మంది నటులకు బాగా కలిసి రావడమే కాదు..బాగా పాపులర్ కూడా అయ్యారు. 
Image result for telugu chandamama movie

ముఖ్యంగా హరితేజ, శివబాలాజి, ధన్ రాజ్, నవదీప్ లాంటి వారికి ఇండస్ట్రీలో మంచి క్రేజ్ వచ్చింది.  ‘బిగ్ బాస్’ షో ఆరంభం కావడానికి ముందు శివబాలాజీ, నవదీప్‌ల పరిస్థతేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శివబాలాజీ అప్పుడప్పుడూ ఏవో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ నెట్టుకొస్తుంటే.. నవదీప్ అసలు సినిమాలేమీ లేకుండా ఖాళీగా ఉన్నాడు.
Image result for telugu bigg boss latest contestants

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘చందమామ’ చిత్రం తర్వాత ఇద్దరి కెరీర్ లు చెప్పుకోదగ్గంతగా లేవు.  ఇక బిగ్ బాస్ తర్వాత వీళ్ల పాపులారిటీ బాగానే పెరిగింది.  దీంతో తెలుగు పరిశ్రమలో ఓ పెద్ద నిర్మాణ సంస్థ వీళ్లిద్దరి కాంబినేషన్లో ఓ చిన్న స్థాయి మల్టీస్టారర్ ప్లాన్ చేస్తుండటం విశేషం. ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తాడట.

శివబాలాజీ చివరగా ‘కాటమరాయుడు’లో పవన్ కళ్యాణ్ తమ్ముడి పాత్ర చేశాడు.  నవదీప్ చివరగా ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో నటించాడు. మరి శివబాలాజీ, నవదీప్ కలిసి చేయబోయే సినిమా కెరీర్ మలుపు తిరుగుతుందో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: