అల్లు అరవింద్ వెనక్కి తగ్గాడా..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో మెగాస్టార్ తనయుడు రాంచరణ్ నటించిన రెండవ చిత్రం ‘మగధీర’.  దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాత.  అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ హిట్ గా ఎన్నో రికార్డులు నెలకొల్పింది.  ఇక బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, కృతిసనన్ జంటగా నటించిన బాలీవుడ్ సినిమా ‘రాబ్తా’ ట్రైల‌ర్‌ను చూసిన త‌రువాత నిర్మాత అల్లు అరవింద్ ఆ సినిమా ‘మ‌గ‌ధీర’ సినిమాకు కాపీ అంటూ రాబ్తా యూనిట్ పై కేసు వేసిన విష‌యం తెలిసిందే.

అయితే దీనిపై ఆ చిత్ర యూనిట్ ఓ బహిరంగ లేఖ సోషల్ మీడియాలో ఉంచింది.  కేవలం ట్రైలర్ చూసి సినిమాపై అంచనాలు వేసుకోడం ఎంత వరకు న్యాయం..ఇలాంటి ఫీట్స్ ఎన్ని సినిమాల్లో లేవు అని ప్రశ్నించింది.  అసలు రాబ్తా చిత్రానికి మగధీర చిత్రానికి ఏమాత్రం పోలిక లేదు..సినిమా విడుదల చేసిన తర్వాత మీకే తెలుస్తుందని గట్టిగా వాదించారు.  

దీంతో  అల్లు అరవింద్ ఈ విష‌యంపై వెన‌క్కుత‌గ్గారు. రాబ్తా యూనిట్ వాదనతో సంతృప్తి చెందిన న్యాయ‌స్థానం వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అల్లు అర‌వింద్ తాను వేసిన కేసును ఈ రోజు ఉదయం వెన‌క్కి తీసుకున్నారు.దినేష్ విజన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న కూడా పూర్వ జన్మకు సంబంధించింది కావడం విశేషం.  

మ‌గ‌ధీర‌లోలాగే హీరో, హీరోయిన్లు వందల ఏళ్ల కింద‌ ప్రేమించుకోవటం,  తిరిగి జన్మించి త‌మ ప్రేమ‌ను నిలుపుకోవ‌డంతో పాటు ఈ బాలీవుడ్ మూవీలో హీరో వంద మందితో ఫైటింగ్ చేయ‌డం వంటి సీన్లు కనిపించడం ఆ ఆరోప‌ణ‌లకు బ‌లం చేకూర్చాయి. చివ‌రికి అల్లు అరవింద్ కేసు వెన‌క్కి తీసుకోవ‌డంతో లైన్ క్లియ‌ర్ అయింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: