శృతి హసన్! యథా పేరెంట్స్ తథా బేబీస్




నటనతో చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది శృతి. అయినా అందాల ఆరబోతలో శృతి ఈ మధ్య బాగా ఔదార్యం చూపిస్తుంది. ఫీల్ ఫ్రెండ్లీ అండ్ ఓపెన్ మెంటాలిటి. విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తెగా వెండితెరమీద తను అరంగేట్రం చేసినా శృతిహాసన్, ఆతర్వాత తన నటన అందం తో దక్షిణ భారత ప్రేక్షకు లను బాగానే కట్టిపడేఅసి మెప్పిస్తూవస్తూ వచ్చింది.


అయితే, ఈమె చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన కొత్తల్లో ఒకసంగీత దర్శకుడిపై మనస్సు పారేసుకుందట. ఆ తర్వాత అతనితో చాలా సన్నిహితంగా మెలుగుతూ వచ్చిందట అలా క్లోజ్‌గా ఉండటానికి గల కారణం తెలుసుకున్న తర్వాత అతనితో కటీఫ్ చెప్పేసిందట. ఇదే అంశంపై శృతిహాసన్ తాజా స్పందిస్తూ:

 
"గతంలో ఓ మ్యూజిక్ డైరెక్టర్‌ను బాగా ఇష్టపడ్డాను. ఆయన చాలా మంచి వ్యక్తి. మేమిద్దరం చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యేవాళ్లం. దానినే నేను ప్రేమ అనుకున్నాను. అయితే నాది ప్రేమ కాదు ఆకర్షణ అని తర్వాత తెలిసింది" అని చెప్పింది.  రిలేషన్ బ్రేకప్ అయిన తర్వాత గాని తాను దానిని అర్థం చేసుకున్నానని చెప్పింది. ఆ తర్వాత ఇక ఎవరితోనూ ఆ తరహా రిలేషన్ పెట్టుకోలేదని చెప్పింది.

 

ఇకపోతే ప్రస్తుతానికి తాను ప్రొఫెషనల్ గా చాలా బిజీగా ఉన్నానని తనకు బాయ్ ఫ్రెండ్‌ తో గడిపే సమయం లేదని చెప్పింది. పెళ్లి గురించి కూడా ప్రస్తుతం ఎలాంటి ఆలోచన లేదని తెలిపింది. 


"పిల్లల్ని కనాలంటే పెళ్ళే చేసుకోవాలన్న రూల్ ఏమీ లేదు కదా! అనౄఉ తనమనసులోని మాటను బయట పెట్టింది ఈ భామ అదేమంటే, "తనకు ఒక వ్యక్తి నచ్చితే అతనితో పిల్లల్ని కంటానని" చెప్పింది. ఈ విషయంలో తనకు తన తల్లిదండ్రులే ఆదర్శమని చెప్పింది. పర్వాలేదు జాతికి మంచి ఔదార్యంతో కుడిన సందేశాలే ఇస్తుంది కమల్ పుత్రిక. అయినా "ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా! మరి. యదా పితుః తథా పుత్రి" 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: