ఈ నెలాఖరుకు ‘రైల్వేస్టేషన్’

Durga
దిగ్గజ దర్శకులైన మణిరత్నం, ప్రియదర్శన్, రామ్ గోపాల్ వర్మ వంటివారి చిత్రాలతో పాటు దాదాపు 150 చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన కృష్ణమాయ తొలిసారిగా డైరెక్టర్ గా చేస్తున్న చిత్రం ‘రైల్వేస్టేషన్’, మాస్టర్ తుహిన సమర్పణలో లక్ష్మికృష్ణ పతాకంపై శివ, సందీప్, జయంత్ హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెలాఖరుకు విడుదల కానుంది.  ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణమాయ మాట్లాడుతూ... ఎన్నో చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఎక్స్పిరియన్స్ ఈ ‘రైల్వేస్టేషన్’ రూపకల్పనకు ఎంతగానో ఉపయోగపడింది. జయంత్ సంగీత సారధ్యంలో రిలీజైన ఆడియోకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన రావడం ఆనందంగా ఉంది. షూటింగ్ అనంతరం కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి కాట్రాజ్ సుప్రీత్ ప్రత్యేక ఆకర్షణ కానున్నాడు.  షూటింగ్ అనంతరం కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్నిఇప్పటికీ ఎన్నో సినిమాలకు పిఆర్ఓగా వ్యవహరించిన వీరబాబు రిష్ట్రిబ్యూషన్ చేయడానికి ముందుగా రావడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ నెలాఖరుకు సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. ప్రతి ఒక్కరిని మెప్పించే, మళ్లీ మళ్లీ రప్పించే అంశాలు ఈ చిత్రంలో చాలా ఉంటాయి. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన చిత్రం ‘రైల్వైస్టేషన్’ అన్నారు. పీఆర్వో, డిస్ట్రిబ్యూటర్ వీరబాబు మాట్లాడుతూ, ‘ ఈరోజుల్లో. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ చిత్రాల తర్వాత మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్న చిత్రం ‘రైల్వైస్టేషన్’, డైరెక్టర్ కృష్ణబాబు గారు చిత్రాన్ని చాలా వెరైటీగా తెరకెక్కించారు. మాస్ ఆడియన్స్ ని మెప్పించే అంశాలు ఈ చిత్రంలో చాలా ఉన్నాయి. ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్టయి, డైరెక్టర్ కృష్ణమాయ గారికి మంచిపేరు తీసుకురావాలని కోరుకుంటున్నాని అన్నారు. సుప్రీత్, బెనర్జీ, జయంత్, భీమిలి, శివ, సందీప్, శివ, శ్రావణీ, గమ్యం, సంధ్య, అల్రరి సుభాషిణీ మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి డ్యాన్స్: బందర్ కిరణ్, కెమెరా: జి.యల్.బాబు, సంగీతం: జయంత్, ఎడిటింగ్: ఆవుల వెంకటేష్, నిర్మాత : రమారాధిక, కథ –స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కృష్ణమాయ.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: