బ్ర‌హ్మీ అసిస్టెంట్‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్‌

Chowdary Sirisha
త్రివిక్ర‌మ్ మ‌రోసారి ప‌వ‌న్ క‌ల్యాణ్ నుంచి కావ‌ల్సినంత వినోదం పిండుకొంటున్నారు. జ‌ల్సా త‌ర‌వాత వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ప‌వ‌న్ క‌ల్యాణ్ పాత్ర చాలా జోష్‌గా ఉండ‌బోతోంది. ఇందులో బ్ర‌హ్మానందం ఓ రియ‌ల్ట‌ర్‌గా క‌నిపిస్తారు. బ్ర‌హ్మీ అసిస్టెంట్ పాత్ర‌లో ప‌వ‌న్ న‌టిస్తున్నారు. బ్ర‌హ్మీ, ప‌వ‌న్ క‌ల‌యిక‌లో వ‌చ్చిన స‌న్నివేశాలు భ‌లే త‌మాషాగా ఉంటాయ‌ట‌. జ‌ల్సాలో ప‌వ‌న్‌, బ్ర‌హ్మీ కాంబినేష‌న్ కేక పెట్టించింది. అదే సీన్ ఈ కొత్త సినిమాలోనూ రిపీట్ కాబోతోంద‌న్న‌మాట‌. ప‌వ‌న్ స‌ర‌స‌న స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: