తమన్నా సౌందర్య రహస్యాలు-ఎన్నో తెలుసా?


తన సౌందర్యాన్ని కాపాడుకోవటానికి వెన్నెలముద్ద, మీగడతరక తమన్నాభాటియా ఎంత దూరమైనా వెళతానని ఎంత కష్టమైనా భరిస్తానని చెప్పుతారు. తన ఫిగర్ కాపాడుకోవటానికి ఎలాంటి అశ్రద్ధ నిర్లక్ష్యం వహించ నని చెపుతారు తమన్నా.  నిరంతరం తన సౌందర్యాన్ని సహజమైన పద్దతుల్లోనే కాపాడుకుంటుంది. తన పరిశ్రమ లోనే సమకాలీన  కథానాయికల కంటే విభిన్నత ప్రస్పుటించె తమన్నా సౌందర్య పోషణా పద్ధతులు ఆమెను మిల్కీ బ్యూటీగా, "చాంద్ సా రోషన్ చహారా" గా (వెన్నెలంత చల్లనైన చంద్రముఖి) పోల్చటం ఆ చంద్రముఖికి సరిగ్గా సరిపోతుంది.  


అందుకే ఆమెను వెన్నెలముద్దని పిలుస్తారు.  తొలిచూపు లోనే చూపరులను కట్టిపడేసే మేని నిగనిగల వెనుక ఆమె సౌందర్య పోషణ లో ఎలాంటి రసాయన కృత్రిమ సౌందర్య సాధనాలని వాడక పోవటమే అంటుంది నింగి నుండి జారి పడ్డ వెన్నెల తునక తమన్నా. తన నటన లో భాగంగానే క్షణం క్షణం మారే వాతావరణము, మేకప్స్ కు ఎక్స్పోజ్ అయ్యే తన దేహం ఇంత మృదువుగా ఎలా ఉంటుందో అర్ధంకాక తన మునక లౌతుంటారు సహ నటీ మణులు ప్రేక్షకులు కూడా! సహనటీమణులు సుందరాంగులు అసూయ పడే అందమైన మెరిసే దేహకాంతి తో పలుచని పొట్టతో స్లిం ఫిగర్ సంపద - ఇప్పటికీ మెయింటైన్ చేయటం చేయగలగటం ఆమె గొప్పదనమే.   దీనికి తమన్నా చేయని సాధన అంటూ ఏమీలేదు.


ఈ సౌందర్య రక్షణ వెనుక తన తల్లి తనను కృత్రిమ, రసాయన సౌందర్య ఉత్పత్తులని ఉపయోగించ నివ్వకపోవటమేనని అంటారు ఆమె.  కనీసం ఫెయిర్నెస్ క్రీంస్ విలువైన కాస్మెటిక్స్ కూడాతను వాడనంటుంది తమన్నా. వంశపారంపర్యంగా తన చర్మ శిరోజ ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవటం, అ తన గ్లామర్ ప్రొఫెషన్ కు దేహా అకృతి మెయింటైన్ చేసుకోవటం తనకు తప్పనిసరి అంటారు తమన్నా.


ఈ అందాల సుందరాంగి తన సౌందర్య నియంత్రణ  విధానాన్ని ఒక సందర్భంలో 18 పాయింట్స్ లో  వెల్లడించారు.  


*తానెప్పుడూ వెజెటేరియన్ డైట్ తీసుకుంటారు

*తన బోడీ ని కూల్ గా ఉంచటానికి యోగర్ట్ (పెరుగు) తన ఆహారంలో తీసుకుంటారట. తాను పెద్ద పెరుగు అభిమానినంటారు తమన్నా.

*తనకు ఫ్రైడ్, ప్రోసెస్సెడ్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం. కాని తాను వాటిని ఎప్పుడూ తీసుకోరట ఫిగర్ మెయింటైన్ చెయటం కోసం.

*తను ఎక్కువగా నీరు, పండ్ల రసాలు, సూప్స్ తీసుకొంటూ దేహాన్ని హైడ్రేటెడ్ గా ఉంచే అలవాటు చేసుకున్నారు.

*తన దినచర్య నానబెట్టిన పిడికెడు బాదం పప్పులు తినటం మరియు

*కొద్దిగా తేనె కలిపిన గోరువెచ్చని నీరు గింజలు తాగటం తో ప్రారంభిస్తారు.


*షుగర్ సంబందిత పదార్దాలు అసలు తీసుకోరు - తినరు.

*షూటింగ్ లేనిరోజు ఆలు మేకపే వేసుకోరు సాధారణ అమ్మాయిలాగే ఉంటారు.

*తనకు మేకప్ లేకుండా సదా మామూలుగా ఉండటమే ఇష్టం.

*కృత్రిమ రంగులు ఉపయోగించ కుండా శిరోజాలూ తేలికగా ఉండేలా  చూసుకుంటారు జాగ్రత్త తీసుకుంటారు.

*ఎస్టీ-లాడర్ అతి సహజమైన లిప్-స్టిక్. ఆమెకు చాలా ఇష్టమైనది

*తను ఏ ఒక్కరోజూ జిం-లో ఒకగంటైనా గడపకుండా ఉండలేరు-అబ్-క్రంచెస్, కార్డియో, బరువు, ఫ్రీ-హాండ్ ఎక్సర్సైజెస్ నియమం తప్పకుండా ఎక్స్-పర్ట్ ట్రైనర్ సహాయంతో చేస్తారు.


*తన ఆరోగ్యాన్ని అందాన్ని కాపాడుకోవటానికి రోజు ప్రత్యేక వ్యాయామాలు చేస్తారు.

*తన ఫేస్-పాక్ తనే శనగపిండి, వేప రసం, పసుపుపొడి తో తయారు చెసుకుంటారు.

*సీకాయ, బొప్పాయి, ఉసిరిక తో తనే తాయారు చేసుకున్న మిశ్రమాన్ని శిరోజాలను శుభ్రపరచుకుంటారు. షాంపూను తాను అసలే ఉపయోగించరు.

*నిద్రించటానికి ముంఫు పూర్తిగా మేకప్ తీసివేసి శుబ్రంగా స్నానం చేస్తారు, తాజాగా ఉంటారు.

*తాను తన చర్మాన్ని మృదువైన హెర్బల్ స్క్రబ్స్ తో మెత్తగా నునుపుగా ఉంచుకుంటారు.

*తానెప్పుడూ చిరునవ్వుతో ఉండటమే తనలోని అందరు మెచ్చే ఆకర్షణ అంటారు తమన్నా.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: