పెళ్లైనా కూడా ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్
ఇతంతా కరీనాకపూర్ విషయంలో జరుగుతుందని అంటున్నారు. కరీనాకపూర్, సైఫ్ అలీ ఖాన్ ఇద్దరూ పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వీరిద్దరూ ఒకరికొకరు దూరంగా ఉంటున్నారనే టాక్స్ వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా కరీనాకపూర్..ఇంటర్నేషనల్ ఫ్యాషన్ డిజైనర్ తో కలిసి తిరుగుతున్నారని అంటున్నారు. దీంతో ఈ న్యూస్ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా మారింది.
విషయంలో సైఫ్ అలీ ఖాన్ సైతం సెలైంట్ గా ఉండటం విశేషం. ప్రస్తుతం కరీనాకపూర్ చేతిలో తక్కువ చిత్రాలే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తక్కువ చిత్రాలను ఒప్పుకుంటుంది. తను ఏదైనా మూవీ ఒప్పుకోవాలంటే అందుకు ప్రత్యేకమైన కారణాలు ఉండాలని చెప్పుకుంటుంది. ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోవటానికి కరీనాకపూర్ అస్సలు అగీకరించటం లేదు.
వ్యక్తిగత లైఫ్ లో ఎఫైర్ కారణంగానే తను ఈ విధంగా సినిమాలకి దూరంగా ఉండాల్సి వస్తుందనే వార్తలు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ జోరుగా వస్తున్నాయి. అయితే గతంలోనూ ఈ తరహా టాక్స్ వచ్చినప్పుడు సైఫ్ అలీ ఖాన్, కరీనాకపూర్ ఇద్దరూ కలిసి ఖండించారు. ఇప్పుడు వీరిద్దరూ ఈ విషయంపై సైలెంట్ గా ఉండటంతో ఇది చర్ఛనీయాంశంగా మారింది.