ప్రముఖ నటుడు రజనీకాంత్ నేడు జన్మదినాన్ని నిర్వహించుకుంటున్నారు. తన నటనతో అందర్నీ విశేషంగా ఆకట్టుకునే రజనీకాంత్ కొన్ని సరదా జోక్స్ నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. రజనీ కాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఆ జోక్స్ లో కొన్ని మీకోసం...
1. రజనీకాంత్ మిస్డ్ కాల్ కు కూడా అన్సర్ ఇవ్వగలడు.
2. రజనీకాంత్ ఈమెయిల్ ఐడి : జిమెయిల్ @ రజనీకాంత్. కామ్
3. గతంలో రజనీకాంత్-కాలానికి మధ్య పోటీ జరిగింది. ఇందులో రజనీకాంత్ ఎప్పుడో విన్ అయితే, కాలం ఇంకా పరుగుపెడుతూనే ఉంది.
4. గజనీ కూడా రజనీకాంత్ ను గుర్తు పెట్టుకుంటాడు.
5. పొరపాటున రజనీకాంత్ ఓ తప్పు చేస్తే, అది ఓ కొత్త ఆవిష్కరణ అవుతుంది.
6. టీచర్స్ డే రోజున రజనీకాంత్ కు సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ శుభాకాంక్షలు చెబుతారు.
7. రజనీకాంత్ రిసైకిల్డ్ బిన్ నుకూడా డిలిట్ చేయగలడు.