
కేరింత : రివ్యూ
సుమంత్ అశ్విన్, ఇప్పటికి ఇటువంటి పాత్రలు పలుమార్లు చూసాం అనాలో లేక అయనక ఏ పాత్ర అయినా ఇలానే చేస్తాడు అనాలో తెలియట్లేదు కాని మొదటి చిత్రం "తునీగా తునీగా" నుండి అయన బాడీ లాంగ్వేజ్ మరియు ఎక్స్ప్రెషన్ లో తేడా బొత్తిగా కనపడదు. పాత్ర ఏదయినా అదే రకమయిన నటన కనబరుస్తున్నాడు ఈ నటుడు కాస్త పాత్రకి తగ్గ తేడా చూపిస్తే బాగుంటుంది. శ్రీ దివ్య పాత్ర అంత పెద్దది కాదు కథలో సరిగ్గా ఇమడలేదు , హీరో కి హీరోయిన్ ఉండాలి కాబట్టి ఈ పాత్ర అన్నట్టు ఉంటుంది. ఉన్నంతలో ఈ నటి ఆకట్టుకున్నా కూడా బలం లేని పాత్రలో ఎంత నటన కనబరిచినా ప్రేక్షకుడిని కనెక్ట్ చెయ్యలేరు కదా.. ఈ పాత్ర కూడా అంతే .. అమెరికా నుండి వచ్చిన అమ్మాయి పాత్రలో నటించిన తేజస్వి మదివాడ ఆకట్టుకుంది అటు అందంతోనే కాకుండా అమాయకత్వం కూడా కలబోసి నటనతో కూడా ఆకట్టుకుంది. ఒక భాద్యత గల విద్యార్థిని గా సుకీర్తి నటన బాగుంది. విశ్వనాధ్ నటన కొన్ని సన్నివేశాలలో పరవాలేదు అనిపించినా కీలకమయిన ఎమోషనల్ సన్నివేశాలలో అత్యంత పేలవంగా ఉన్నాయి. పార్వతీశం , శ్రీకాకుళం నుండి వచ్చిన అమాయకమయిన పాత్ర ధరించిన ఈ నటుడు కొంతమేరకు ఆకట్టుకున్నాడు చిత్రంలో అప్పుడప్పుడు ఊరటనిచ్చిన పాత్ర ఇదొక్కటే కాని సమస్య అంటే ఈ నటుడు కొంతమేరకు ఆకట్టుకున్నా చాలా వరకు విసిగించాడు. అతని యాస అక్కడక్కడా బానే ఉన్నా అనవసరం అనిపించిన సన్నివేశాలెన్నో ఉన్నాయి. మిగిలిన నటీనటులందరు వారి పత్రాల మేరకు ఆకట్టుకున్నారు..
కొత్తది అని చెప్పుకోడానికి ఆస్కారం లేని కథ ఇది , ఈ చిత్రం ఎప్పుడో మొదలయినా కూడా ఇప్పటికే ఇలాంటి కథలు పలుమార్లు తెర మీద చూడటం మూలానా ఈ కథ అప్పటికి కొత్తదే అయ్యుండచ్చు ఇప్పుడు మాత్రం చాలా పాతది. కథనం విషయానికి వస్తే ఆరు పాత్రలు ఆరు జీవితాలు వాటి మధ్య బంధాలను సరిగ్గా చూపిస్తే కనెక్ట్ అవుతాయి. ఈ విషయం లో కథనం అతి దారుణంగా ఫెయిల్ అయ్యింది ఏ పాత్రకి ఆ పాత్ర అదొక్కటే పాత్ర అన్నట్టు ప్రవర్తించాయి. ఒక స్నేహితుల గ్యాంగ్ కథ అని చెప్పినా కూడా ఈ చిత్రం చూడటానికి ముగ్గురు వేరు వేరు యువకుల ప్రేమకథలు అన్నట్టు అనిపిస్తుంది. వీరి మధ్య స్నేహాన్ని సరిగ్గా చూపించకుండా ప్రేక్షకుడిని ఎలా కనెక్ట్ చెయ్యాలి అనుకున్నారో కథన రచయితలు ... సాయి కిరణ్ అడివి దర్శకత్వం కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. అబ్బూరి రవి అందించిన మాటలు కొన్ని బాగా ఉన్నా ఎమోషనల్ సన్నివేశాల వద్ద కావలసిన ఎమోషన్ అయితే రాలేదు మరీ పేలవంగా సాగాయి. విజయ్. కె. చక్రవర్తి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ హైలెట్స్ లో ఇదొకటి. సంగీతం అందించిన మిక్కి జె మేయర్ అటు పాటలతో ఇటు నేపధ్య సంగీతంతో ఆకట్టుకున్నారు. కొన్ని కీలక సన్నివేశాలు ఆ మాత్రం నిలబడ్డాయి అంటే కారణం మిక్కి అందించిన సంగీతమే కారణం. "మిల మిల " మరియు "కేరింత" పాటలు చాలా బాగున్నాయి. మధుసూదన్ అందించిన ఎడిటింగ్ ఆకట్టుకోలేదు చిత్ర నిడివి మరియు జంప్స్ చాలా కనిపించాయి.
కాలేజీ చిత్రాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది , తాజాదనం లేని కాలేజీ కథ ఎప్పటికీ విజయవంతం కాదు ఈ చిత్రం లో వచ్చిన సమస్య అదే హ్యాపీ డేస్ లో వర్క్ అవుట్ అయిన ఇరవై నిమిషాల చిత్రాన్ని సాగదీసి రెండు చిత్రాన్ని చేసారు. వారి మధ్య స్నేహాన్ని సరిగ్గా చుపెట్టకుండా సమస్యలను సృష్టించి కనెక్ట్ అవ్వమంటే ప్రేక్షకుడు ఎలా కనెక్ట్ అవ్వగలడు. అందరు ఆశయాలు చదువులు అంటారు కాని ఈ చిత్రం మొత్తం ప్రేమ చుట్టూ తిరుగుతుంది కనీసం స్నేహం కూడా కనపడదు. కథనంలో కీలక లోపం ఇదే, యువత ఒక లక్ష్యం తో ముందుకి సాగాలి దానికి ప్రేమ తోడవ్వాలి కాని ఈ చిత్రంలో గమ్యంలేని యువత ప్రేమలో పడినట్టు చూపించారు .. సరిగ్గా చెప్పాలంటే భాద్యత గల యువతలాగా పాత్రలను చూపిస్తూ బాద్యత రహితమయిన కథనం తో ఆ విషయం కనపడనివ్వకుండా చేసారు. ఈ చిత్రం లో లాజిక్స్ గురించి మాట్లాడితే , డిగ్రీ చేసి ఎం ఏ చేస్తున్న ఒక విద్యార్థికి "Get Well Soon" అంటే ఏంటో తెలియదు అని చెప్పి నమ్మంచాలని ప్రయత్నించినప్పుడు మిగిలిన లాజిక్స్ గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. ఈ చిత్ర క్లైమాక్స్ వద్ద బొమ్మరిల్లు పోలిన ఒక సన్నివేశం ఉంటుంది అప్పటి వరకు అమ్మను చూసి భయపడని ఒక పాత్ర తన భయాన్ని పక్కనపెట్టి ధైర్యంగా మాట్లాడటం.. నిజానికి ఇది చాల మంచి సన్నివేశం అద్భుతంగా రాసుకొని ఉండచ్చు కాని దర్శకుడి హడావిడి కథనం వాళ్ళ అక్కడ ఎమోషన్ పండకపోవడం పక్కనపెట్టి ప్రేక్షకుడు నవ్వుకునేలా తయారయ్యింది. మంచి చిత్రం అన్నివిధాలా ఆస్కారం ఉన్న ఈ చిత్రాన్ని కేవలం కథనం చంపేసింది అని చేపుకోవచ్చు ఎందుకంటే పలు విషయాల మీద పెట్టిన శ్రద్ధ పాత్రల మధ్య బంధాన్ని చూపించడానికి ఉపయోగించుకుంటే బాగుండేది. "కేరింత" తాజాదనం లేని కాలేజీ కథ , కాలేజీ బ్యాక్ డ్రాప్ ఉన్న చిత్రం ఎలా ఉన్న చూస్తా అనుకుంటేనే ఈ చిత్రానికి వెళ్ళండి ...