సుప్రీమ్ : రివ్యూ
అనంతపురంలో జాగ్రుతి అనే స్వచ్చంధ సంస్థ కింద ఎన్నో వేల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. రాజ కుటుంబమైన రాఘవరావు దాన్ని ఊరి ప్రజల బాగుకోరిన వారికి రాసి ఇచ్చేస్తారు. జాగ్రుతి స్వచ్చంద సంస్థ విషయాలన్ని నారాయణ రావు (సాయి కుమార్) చూస్తుంటాడు. అయితే సంతోషంగా ఉన్న జాగ్రుతి సంస్థ మీద విక్రం సర్కార్ (కబిర్ సింగ్) కన్ను పడుతుంది. ఫేక్ డాక్యుమెంట్స్ తో ఆ ట్రస్ట్ కు సంబందించిన భూములన్ని తన పేరిట రాయించుకుంటాడు. ఆ ట్రస్ట్ తాలుకు రాజ కుటుంబీకుల దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉటాయని.. దాని కోసం ఓ నెల పాటు గడువు అడుగుతారు నారాయణ రావు.
ఇక ఇదిలా ఉంటే హైదరాబాద్ లో ట్యాక్సీ డ్రైవర్ గా ఉంటున్న బాలు (సాయి ధరం తేజ్) తండ్రి (రాజేంద్ర ప్రసాద్)తో కలిసి నివసిస్తుంటాడు. తనకు నచ్చిన విషయం కోసం రిస్క్ తీసుకునే క్యారక్టర్ గల బాలుకు అనుకోకుండా రాజన్ (మైఖేల్ గాంధి) కుర్రాడు తారస పడతాడు. అక్కడ నుండి కథ కొత్త మలుపు తిరుగుతుంది. ఓ పక్క మొదటి చూపులోనే లేడీ పోలీస్ గా బెల్లం శ్రీదేవి (రాశి ఖన్నా) సాయి ధరం తేజ్ లవ్ పడతాడు. అసలు విక్రం సింగ్ చంపాలనుకుంటుంది ఎవరిని..? రాజన్ కు బాలు ఎలా పరిచయమయ్యాడు..? జాగ్రుతి ట్రస్ట్ భూములు ఎవరి సొంతమయ్యాయి..? అన్నది అసలు కథ.
సుప్రీం డోంట్ సౌండ్ హార్న్ అంటూ ఓ టెంపోతో వచ్చిన సాయి ధరం తేజ్ మరోసారి తన స్టైలిష్ యాక్షన్ ను చూపించాడు. బాలుగా సరదాగా క్యాబ్ డ్రైవర్ గా కనిపించే సాయి ధరం తేజ్ తనకు స్కోప్ ఉన్నంత వరకు మంచి ప్రతిభ కనబరించాడు. ఇక డ్యాన్సుల్లో కూడా మంచి ఈజ్ తో చేసి మెగా స్టామినా ఏంటో చూపించాడు. ఇక బెల్లం శ్రీదేవిగా పోలీస్ పాత్రలో నటించిన రాశి ఖన్నా కూడా ఓకే అనిపించింది. కథలో తన పాత్రకు స్కోప్ తక్కువ ఉన్నా ఉన్నంతలో రాశి పర్వాలేదనిపించింది. ముఖ్యంగా సాంగ్స్ లో రాశి ఖన్నా గ్లామర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంది. మెగాస్టార్ రీమిక్స్ సాంగ్లో సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నాల పెయిర్ బాగుంది. విక్రం సర్కార్ గా కబీర్ సింగ్ ఒకే కాని ఆ పాత్ర విలనిజాన్ని ప్రదర్శించడంలో దర్శకుడు విఫలమయ్యాడు.
ఇక సినిమాలో బికుగా నటించిన రవి కిషన్ ఓ పక్క విలనిజం చూపిస్తూనే మంచి కామెడీ పండించాడు. బికు పక్క జబర్దస్త్ శేషు కూడా మంచి పంచ్ లిస్తూ కామెడీ చేశాడు. ఇక క్యారక్టర్ ఆర్టిస్ట్ సాయి కుమార్, రాజేంద్ర ప్రసాద్ మరోసారి తమ నటనా ప్రదర్శనతో ప్రేక్షకులు మెప్పించారు. సినిమాలో రాశి ఖన్నా తండ్రిగా రఘుబాబు, అసిస్టెంట్ గా వెన్నెల కిశోర్, కార్ల దొంగలుగా జింగ్ జింగ్ గ్యాంగ్ గా 30 ఇయర్స్ ఫృథ్వి, ప్రభాస్ శీను మంచి కామెడీ పంచారు. అంతేకాదు సన్నాయి మోతలతో బ్యాండ్ మేళం బ్యాచ్ గా పోసాని కృష్ణ మురళి, శ్రీనివాస్ రెడ్డి కూడా మంచి కామెడీని పంచారు.
పటాస్ తో దర్శకుడిగా పరిచయమై సక్సెస్ సాధించిన అనీల్ రావిపూడి సుప్రీం గా సాయి ధరం తేజ్ ను చూపించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కథ పాతదే అయినా దర్శకుడు దాన్ని తెరేక్కించే ప్రయత్నంలో కాస్త పొరపాట్లు చేసినా ఫైనల్ గా ఓకే అనిపించుకున్నాడు. ఇక సినిమాకు మరో ముఖ్య పాత్ర పోశించింది మ్యూజిక్. సాయి కార్తిక్ సంగీతం అందించిన సుప్రీం సాంగ్స్ సినిమాకు మంచి పాజిటివ్ ఎనర్జీని తెచ్చాయి.
ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సాయి కార్తిక్ ఇంప్రెస్ చేశాడు. సాయి శ్రీరాం సినిమాటోగ్రఫీ సినిమాకు బలాన్ని ఇచ్చింది. ఓడిశా ఎపిసోడ్స్ లో కెమెరా పనితనం బగుంటుంది. ఎం.ఆర్ వర్మ ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దిల్ రాజు నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బ్యానర్ రిచ్ నెస్ సినిమా ప్రతి ఫ్రేమ్ లో కనబడుతుంది.
మరింత సమాచారం తెలుసుకోండి:
-
REVIEW
-
Supreme
-
Cinema
-
raasi
-
Comedy
-
Konakalla Narayana Rao
-
Hyderabad
-
Driver
-
Father
-
Kurradu
-
Traffic police
-
Jaggery
-
Love
-
raashi khanna
-
Rashi Khanna
-
Chiranjeevi
-
Kabir singh
-
Director
-
Darsakudu
-
Ravi Kishan
-
Jabardasth
-
rajendra prasad
-
babu rajendra prasad
-
Audience
-
vennela
-
Prabhas
-
krishna
-
srinivas
-
Kavuru Srinivas
-
Success
-
anil ravipudi
-
Karthik
-
Paritala Sriram
-
Ram Gopal Varma
-
dil raju
-
Hero
-
Heroine
-
Josh
-
Pataas
-
Pataas 1
-
Pattas