'వసుదేవసుతం' మూవీ రివ్యూ&రేటింగ్!
కథ విషయానికొస్తే..
పురుషోత్తమపురిలో ప్రముఖ వాసుదేవ ఆలయం ఉంటుంది. ఆ ఆలయ చైర్మన్ శర్మ(దువ్వాసి మోహన్)ని హీరా బంధు(మైమ్ గోపి)చంపేసి చైర్మన్ ఎన్నికల్లో తన తండ్రిని గెలిపించుకుంటాడు. వాసుదేవుని ఉత్సవాలకు హైదరాబాద్ లో ఉండే కృశవ్(మహేంద్రన్) ఊరికి వస్తాడు. కృశవ్ లేచిపోయిన తన అక్క ప్రేమపెళ్లికి సపోర్ట్ చేసాడని అన్నయ్య మాట్లాడడు. హీరా బంధు మేనకోడలు భువి(అంబికా వాణి) కూడా ఆ ఉత్సవాలకు వస్తుంది. భువి కృశవ్ ని ఇష్టపడి ఇద్దరూ ప్రేమలో పడతారు.
కానీ కృశవ్.. శర్మ ఏమయ్యాడు, అందరూ వెళ్ళడానికి భయపడే కోయిరాతల అనే ప్రదేశంలో ఏముందో అని వెతకడం మొదలుపెడతాడు. దాంతో పాటు భువితో ప్రేమాయణం నడిపిస్తుండటంతో హీరా బంధు మనుషులు అతనిపై, అతని అన్నపై దాడి చేస్తారు. కృశవ్.. హీరా బంధుతో గొడవపెట్టుకోడానికి అతని ఇంటికి వెళ్తే అసలు వాళ్ళు మనుషులను పంపలేదు అని తెలుస్తుంది. అదే సమయంలో సెంట్రల్ మినిస్టర్(జాన్ విజయ్) ఫోన్ చేసి కృశవ్ జైలు నుంచి తప్పించుకొని వచ్చాడని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు. అసలు కృశవ్ ఎవరు? జైలుకు ఎందుకు వెళ్ళాడు? జైలు నుంచి ఎందుకు తప్పించుకున్నాడు? వాసుదేవ ఆలయంలో ఏముంది? కృశవ్ పై దాడి చేసింది ఎవరు? కొయిరాతలలో ఏముంది? కృశవ్- భువి ప్రేమకథ ఏమైంది? సెంట్రల్ మినిస్టర్ కథేంటి.. ఇవన్నీ తెరపై చూడాల్సిందే..
సినిమా విశ్లేషణ..
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో మెప్పించిన మాస్టర్ మహేంద్రన్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా సినిమాలు చేస్తున్నాడు. మహేంద్రన్ హీరోగా దేవుడి బ్యాక్ డ్రాప్ తో ఈ వసుదేవసుతం సినిమా తెరకెక్కింది. పూరి జగన్నాధ్ ఆలయం, ఆ విగ్రహాలలో ఉండే బ్రహ్మపదార్థం, ఆ ఆలయం కింద ఉండే నిధి చుట్టూ తిరిగే పాయింట్ చాలా బాగుంది. పూరి ఆలయం బ్యాక్ డ్రాప్ తీసుకొని కల్పిత కథను ఆసక్తికరంగా రాసుకున్నారు.
ఫస్ట్ హాఫ్‌లో అసలు ఆ కొయిరాతలలో ఏముంది అనే సస్పెన్స్, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌ని బాగానే క్రియేట్ చేశారు. ఇంటర్వెల్ కి హీరో జైలు నుంచి తప్పించుకు వచ్చాడని ఇచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై మంచి క్యూరియాసిటీని పెంచుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో హీరో అక్క ఎమోషన్ చాలా బాగా పండింది, ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రీ క్లైమాక్స్ లో అసలు విలన్ ఎవరు అని ఇచ్చే ట్విస్ట్ ఊహించని విధంగా ఉండి సర్ప్రైజ్ చేస్తుంది. క్లైమాక్స్ లో AI విజువల్స్ ని బాగానే వాడుకున్నారు మరియు ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉంటుందని లీడ్ ఇవ్వడం గమనార్హం.
నటీనటుల పర్ఫార్మెన్స్..
హీరోగా మహేంద్రన్ తన పాత్రలో బాగానే నటించాడు. హీరోయిన్ గా అంబికా వాణి పర్వాలేదనిపిస్తుంది. నెగిటివ్ షేడ్స్ లో మైమ్ గోపి, జాన్ విజయ్ లు తమ నటనతో మెప్పించారు. హీరో అక్క, బావ పాత్రల్లో నటించిన నటులు ఎమోషనల్ సీన్స్‌లో చాలా బాగా నటించారు. ఆటో రామ్ ప్రసాద్, తులసి, రాజీవ్ కనకాల, టార్జాన్, సమేత బజాజ్, దువ్వాసి మోహన్, శివన్నారాయణ, ఐశ్వర్య లక్ష్మి.. మిగిలిన నటీనటులంతా వారి వారి పాత్రల పరిధి మేర పర్వాలేదు అనిపించారు.
సాంకేతిక అంశాలు..
ఈ సినిమాకు సంబంధించి సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా చోట్ల పర్వాలేదు అనిపిస్తాయి. పూరి ఆలయం మరియు పూరి లొకేషన్స్ ని మధ్య మధ్యలో చక్కగా చూపించారు. దేవుడు మరియు ట్రెజర్ హంట్ బ్యాక్ డ్రాప్లో దర్శకుడు వైకుంఠ్ బోను ఎంచుకున్న పాయింట్ మరియు కథ ఆసక్తికరంగా ఉంది. నిర్మాణ పరంగా సినిమాను తక్కువ బడ్జెట్ లోనే చక్కగా పూర్తి చేసినట్టు తెలుస్తుంది.
మొత్తంగా..
'వసుదేవసుతం' సినిమా పూరి ఆలయం బ్యాక్ డ్రాప్ లో రాసుకున్న ఒక ఆసక్తికర కథ మరియు దేవుడి ఎలిమెంట్స్ తో కూడిన డివోషనల్ టచ్ మూవీ.
రేటింగ్ : 3.0/5.0