టాలీవుడ్: మళ్లీ మొదలైన ఐ బొమ్మ .. బాంబ్ పేల్చిన రవి..!

Divya
చాలామంది థియేటర్లకు వెళ్లలేక, ఐ బొమ్మ, బప్పం వంటి పైరసీలలో సినిమాలు చూసేవారు. కానీ పోలీసులు సైతం ఐ బొమ్మ రవిని ఛేదించి మరి అరెస్టు చేయడంతో ఒక్కసారిగా ఈ విషయం సంచలనంగా మారడమే కాకుండా ఐ బొమ్మ సైట్ కూడా ఆగిపోయింది. కాని ఇప్పుడు తాజాగా మరొకసారి టాలీవుడ్ లో పైరసీ భూతం కలకలం రేపుతోంది.. ఐ బొమ్మ, బప్పం వంటి వాటిపైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరొకసారి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.


ఇటీవల థియేటర్లలో విడుదలైన కొత్త సినిమాలు పైరసీ రూపంలో ఈ రెండు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తుండడంతో నిర్మాతలు తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. ఫిలిం ఛాంబర్ ఫిర్యాదుతో మరొకసారి రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈ రెండు వెబ్సైట్ల పైన కేసు నమోదు చేసి మరి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఒరిజినల్ ఐబొమ్మ వెబ్సైట్ ను నిర్వహించిన రవి అనే వ్యక్తి ఈ వ్యవహారం పైన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న కొత్త ఐబొమ్మ వెబ్సైట్ తో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ క్లారిటీ ఇచ్చారు.


ఎవరో కేటుగాళ్లు ఐబొమ్మ బ్రాండ్ నేమ్ ను వాడుకొని మరి కొత్త వెబ్సైట్ ను క్రియేట్ చేసి ఇలా ఉపయోగించుకుంటున్నారని ఇటీవల కాలంలో విడుదలైన చిన్న పెద్ద సినిమాలు అన్నిటిని కూడా ఈ కొత్త ఐ బొమ్మ ,బప్పం వంటి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారని తెలియజేశారు. గతంలో ఐ బొమ్మకి ఉన్న పాపులారిటీని ఉపయోగించుకొని సినిమా లవర్స్ ను టార్గెట్ చేస్తూ మరి అదే పేరుతో ఇలా కొత్త డొమైన్లను సృష్టించారని తెలియజేశారు. ఓటిటి,థియేటర్ కలెక్షన్స్ పైన ఈ పైరసీ ప్రభావం చాలా గట్టిగా చూపిస్తోందని ఫిలిం ఛాంబర్ ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వ్యవహారం పైన సైబర్ క్రైమ్ పోలీసులు ఎలాంటి చర్యలు చేపడతారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: