ఏంటి శ్రీలీల ఆ క్రికెటర్ తో ప్రేమలో ఉందా..?

Divya
టాలీవుడ్ ,కోలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ శ్రీలీల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరి నటిస్తూ ఉంటుంది. సాధారణంగా క్రికెటర్లు సినిమా సెలబ్రెటీల మధ్య ప్రేమాయనయలు నడవడం ఎప్పటినుంచో చూస్తూనేదే. ఇప్పుడు తాజాగా ఆ లిస్టులో మరో కొత్త జంట చేరినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియాన్ క్రికెటర్ ,ముంబై ఇండియన్స్ బ్యాట్ మ్యాన్ తెలుగువారైన తిలక్ వర్మ హీరోయిన్ శ్రీలీలతో పీకల్లోతులో ప్రేమలో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


గత కొద్ది రోజులుగా వీరిద్దరి పేర్లు నేటిజన్స్ మధ్య హాట్ టాపిక్ గా మారుతున్నాయి. గతంలో తిరుమల దర్శనానికి శ్రీలీల తన కుటుంబ సభ్యులతో వెళ్ళగా అక్కడికి తిలక్ వర్మ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. అంతేకాకుండా ఇటీవలే జరిగిన ఐపీఎల్ మ్యాచ్లలో కూడా శ్రీ లీల కుటుంబ సభ్యులు ముంబై ఇండియన్స్ ఆడే మ్యాచ్ లకు కూడా హాజరు కావడంతో పాటుగా తిలక్ పేరుతో  ఉన్న జర్సీలు కూడా వేసుకొని కనిపించడంతో ఈ రూమర్స్ కు మరింత బలాన్ని అందిస్తున్నాయి.


దీంతో గత ఏడాది నుంచి శ్రీలీల, తిలక్ వర్మ డేటింగ్ లో ఉన్నారనే విధంగా సోషల్ మీడియాలో కూడా పోస్టులు వైరల్ గా మారుతున్నాయి. గతంలో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ అలాగే కేఎల్ రాహుల్, అతియా శెట్టి తరహాలోనే ఇప్పుడు ఈ యంగ్ స్టార్స్ కూడా అదే బాటలో పయనిస్తున్నారా? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. మరి ఈ విషయం పైన అటు తిలక్ వర్మ కాని, ఇటు శ్రీలీల కానీ ఏ విధంగా స్పందించలేదు. అలాగని ఈ విషయాన్ని వారు  అంగీకరించలేదు. ఇవన్నీ రూమర్స లేకపోతే ఏంట అనే విషయం పై ఎవరు క్లారిటీ ఇస్తారు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: