వామ్మో: అన్ని కోట్లు పెట్టీ కొత్త కారు కొన్న వీకే నరేష్..!

Divya

టాలీవుడ్ లో సీనియర్ నటుడుగా పేరు సంపాదించిన నరేష్ ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా నటుడుగా  పేరు సంపాదించారు. ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటించే నరేష్ ఆస్తి విషయంలో కూడా కొన్ని కోట్ల రూపాయలు ఉన్నట్టుగా వినిపిస్తుంటాయి. అంతేకాకుండా నటి పవిత్ర లోకేష్ తో పెళ్లి విషయం పైన కూడా ఎక్కువగా వినిపించేది. ముఖ్యంగా నరేష్ కి కార్లు అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన ఎన్నో కార్లను కొంటూ తనదైన స్టైల్ లో రైడ్ చేస్తుంటారు. ఇప్పుడు తాజాగా మరొక కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.


లుగానో బ్లూ పోర్షే పనామెరా జి 3 టర్బో బ్లూ కలర్ కారుని కొనుగోలు చేశారు. బుల్లెట్ ప్రూఫ్ తరహాలో ఈ స్పోర్ట్స్ కారు కనిపిస్తోంది. అయితే ఈ కారు కేవలం 4.8 సెకండ్లలోనే జీరో నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందట. ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ కారు లేటెస్ట్ మోడల్ టాలీవుడ్లో మరే నటుడు వద్ద లేదని,ఈ ఖరీదైన మోడల్ కారు మొట్టమొదట సొంతం చేసుకున్న నటుడుగా పేరు సంపాదించారు వీకే నరేష్.  అయితే ఈ కారు ధర మార్కెట్ ప్రకారం సుమారుగా రూ. 2.7 కోట్ల రూపాయల వరకు ఉంటుందని వినిపిస్తోంది.


ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో కూడా కొన్ని ఫోటోలు వైరల్ గా మారడంతో ఈ ఫోటోలు చూసి నేటిజన్స్ సైతం ఆశ్చర్యపోగా, మరి కొంతమంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే వీకే నరేష్ దగ్గర లగ్జరీ కార్స్ కలిగి ఉన్నాయి. వీకే నరేష్ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది నారి నారి నడుమ మురారి, హే బలావత్, బ్యాడ్ బాయ్ కార్తీక్, సతీ లీలావతి వంటి చిత్రాలతో ప్రేక్షకులను బాగా అలరించారు. మరిన్ని సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: