అందుకే మూడో భర్తతో విడిపోయా.. బుద్ధొచ్చిందంటూ నటి కామెంట్స్..!

Divya
మలయాళ సినీ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది నటి మీరా వాసుదేవన్. ముఖ్యంగా తన వ్యక్తిగత విషయం వైవాహిక జీవితం గురించి ఎప్పుడు ఏదో ఒక విషయం వినిపిస్తూ ఉంటుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె తన మూడో వివాహ బంధం బ్రేక్ కావడానికి గల విషయాలను బయటపెట్టింది. మీరా వాసుదేవన్ మాట్లాడుతూ నా మూడో భర్త నా కొడుకు పట్ల చూపిన ప్రేమ శ్రద్ధ చూసి అతనితో ఈ బంధంలోకి అడుగు పెట్టాను, అయితే అతను నా కొడుకుకు మంచి తండ్రి అవుతాడని బలంగా నమ్మాను, కానీ కాలక్రమేన ఆ అంచనాలు తప్పు అని బయటపడ్డాయి. అందుకే ఈ బంధం బ్రేక్ కావడానికి కారణమయ్యిందని తెలిపింది.


అలాగే ఇద్దరి విలువల మధ్య తీవ్రమైన పొంతన లేకపోవడం వల్లే విడిపోయామని తెలిపింది. అంతేకాకుండా తన వివాహ జీవితాల గురించి మాట్లాడినప్పుడు చాలామందికి అవి కేవలం గాసిప్స్ లాగా అనిపించవచ్చు,కానీ అది తన జీవితం అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడింది మీరా. సమాజం తనను మూడు వివాహాలు చేసుకున్న స్త్రీగా  ముద్ర వేసినప్పుడు వాటిని అధిగమించాలని  ఆరోజు బలంగా నిర్ణయించుకున్నాని తెలియజేసింది.



తన జీవితంలో తాను 17 సంవత్సరాలు వృధా చేశానని మూడు అర్ధ పర్ధం లేని వివాహాలు తన సమయాన్ని కేటాయించడం వల్లే ఇలా జరిగిందంటూ వెల్లడించింది. ఈ సంవత్సరంలో తాను మరింత తెలివిగా ముందుకు వెళ్లాల్సి ఉందని వెల్లడించింది మీరా. తనకు నచ్చిన మంచి పనులు చేయడం , ఫిట్నెస్ ఒక మంచి కమ్యూనిటీ గా ఉంటుందని ఇతరులకు సేవ చేయడం వంటి వాటి పైన కూడా దృష్టి పెడతానంటూ తెలియజేసింది. అలాగే తన కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతానని, తన బంధాలలో గౌరవం ఇవ్వని, తన శక్తిని విలువైనదిగా చూడని వ్యక్తులను మాత్రం తన జీవితంలో నుంచి తొలగిస్తానని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: