యూట్యూబర్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ హీరోయిన్. !

Divya
టాలీవుడ్ లో మహేష్ బాబు ,పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో జతకట్టి భారీ పాపులారిటీ సంపాదించుకొని బాలీవుడ్లో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి అమీషా పటేల్. ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతున్న అమీషా పటేల్ చివరిగా గదర్ 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నది. ప్రస్తుతం అక్షయ్ ఖన్నా, బాబి డియోల్ కాంబినేషన్లో హమ్ రాజ్ (2002) లో వచ్చే సీక్వెల్లో నటించే అవకాశం ఎక్కువగా ఉన్నది.


అయితే ఎలాంటి విషయాలనైనా సరే మొహమాటం లేకుండా ముఖం మీదే చెప్పేస్తుంది అమీషా పటేల్. ఇందులో భాగంగానే తాజాగా నేటి తరం హీరోయిన్లు పరిశ్రమలో పెరుగుతున్న ఫేక్ పిఆర్ సంస్కృతి పైన సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన వారు కూడా తమను తాము సూపర్ స్టార్లమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. పిఆర్ టీమ్స్ కు డబ్బులు ఇచ్చి మరి మళ్ళీ నెంబర్1, నెంబర్ 2 అని పిలిపించుకుంటున్నారు అంతమాత్రాన ఎవరు కూడా స్టార్స్ అయిపోరు.


2026 నాటి పరిస్థితుల ప్రకారం రూ .100 కోట్లు అనేది ప్రస్తుతం పెద్ద లెక్క కాదని కనీసం రూ .200 కోట్ల రూపాయలు అయినా సాధించిన ఒక్క సినిమా కూడా తమ కెరియర్ లో లేని నటీమణులు కూడా తమని తాము స్టార్లు అంటూ చెప్పుకుంటున్నారు. నా కెరియర్ లో కహో నా ప్యార్ హై, గదర్, గదర్2 వంటి బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. అవి నాతో నటించిన హీరోల కెరియర్లలో అతిపెద్ద విజయాలుగా నిలిచాయని చెప్పుకొచ్చింది. అటువంటి సందర్భంలోనే గదర్ 3 సినిమా గురించి ఒక కీలకమైన అప్డేట్ ఇవ్వడం జరిగింది ఈ చిత్రం కచ్చితంగా రూ .500  కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబడుతుందని ధీమా తెలియజేసింది. తమని విమర్శించడం వల్లే కొంతమంది యూట్యూబర్స్ కి మూడు పూటల కడుపు నిండుతొండి అటువంటి వారిని చూసి జాలి పడడం తప్ప బాధపడకూడదు అంటూ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: