రజనీకాంత్ కంటే కమల్ హాసన్ కే అత్యధిక పారితోషకం.. ఎన్ని కోట్లంటే..?
ఈ సినిమా కోసం కమలహాసన్ ఏకంగా రూ .200 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే అలాగే రజనీకాంత్ రూ 180 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్ ఏకంగా రూ .70 కోట్ల రూపాయల వరకు పారితోషకం ఖరారు అయినట్లుగా కోలీవుడ్లో వినిపిస్తున్నాయి. మిగిలిన బడ్జెట్లో భాగంగా సినిమా నిర్మాణ వ్యయం ఇతర నటీనటుల రెమ్యూనరేషన్ కోసం ఉపయోగించుకోబోతున్నారు.
ఈ ప్రతిష్టాత్మకమైన సినిమాకి సంబంధించి షూటింగ్ పనులు ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కూడా తన సినిమాల పనులలో బిజీగా ఉన్నారు. అలాగే ఈ ఇద్దరి హీరోల డేట్లు సర్దుబాటు విషయంలో , సినిమా సాంకేతికపరంగా అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో #KHXRK ట్యాగ్ ట్రెండీగా కొనసాగుతోంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్తో ఎలాంటి రికార్డులను తిరగరాస్తారో చూడాలి మరి. ఇప్పటికీ రజనీకాంత్ కమలహాసన్ తమ సినిమాలతో ఫ్యాన్స్ ని ఆలరిస్తున్నారు. మరి ఇప్పుడు ఏకంగా ఇద్దరు కలిసి ఓకే సినిమాలో కనిపించడం అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది.