ఎండ వేడి నుంచి రక్షించే భారతీయ పానీయం..?
మార్కెట్లో దొరికే కృత్రిమ పానీయాల కంటే ఈ గంజి చాలా ఉత్తమమైనది. మనం తాగే మజ్జిగ కంటే చాలా పల్చగా ఉంటుంది. ఈ గంజిని తాగడం వల్ల శరీరంలో తగ్గే నీటి శాతాన్ని చాలా సమర్థవంతంగా పెంచుతుంది. గంజి సులభంగా జీర్ణం అవుతుంది, కనుక పేగులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే సహజమైన పిండి పదార్థాల వల్ల శరీరం నీరసాన్ని తగ్గించి వెంటనే ఎనర్జీ లెవల్సిని పెంచేలా చేస్తుంది.
గంజి నీటిలోకి కొంత జీలకర్ర పొడి, నల్ల ఉప్పు లేదా నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల పోషకాల విలువలు పెరగడమే కాకుండా రుచి కూడా పెంచుతుంది. జిలకర జీర్ణక్రియకు ఉపయోగపడితే నల్ల ఉప్పు శరీరానికి అవసరమైన ఖనిజాలను అందించడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు మరియు పొటాషియం వంటివి శరీరానికి చాలా ఉపయోగపడతాయి. ఈ గంజిని ఎలా అయినా తాగవచ్చు. ముఖ్యంగా ఫ్రిజ్లో పెట్టుకొని చల్లారిన తర్వాత అయినా తాగినా సరే ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. అందుకే బియ్యం గంజి కేవలం ఒక పానీయంగానే మాత్రమే కాకుండా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది కాబట్టి మన పూర్వీకులు సైతం ఎక్కువమంది గంజినే తాగేవారు. మరి ఈ వేషం కాలంలో మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి.