సైలెంట్ గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాక్..!
అనంతరం మెహరీన్ స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది. అయితే తమ వ్యక్తిగత కారణాలవల్లే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ తెలియజేశారు. ఆ తర్వాత సినిమాలలో నటించడానికి ఫోకస్ పెట్టినప్పటికీ సరైన అవకాశాలు అందుకోలేకపోయింది. గతంలో వివాహం చేసుకుందనే వార్తలు వినిపించినప్పటికీ వాటిని కొట్టి పారేసింది. గత కొన్ని నెలలుగా సైలెంట్ గా ఉన్న మెహరీన్ తాజాగా సైలెంట్ గా వివాహం చేసుకున్నట్లుగా తన సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో కొన్ని ఫోటోలను షేర్ చేయడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలోనే వీరి వివాహం అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగినట్లు సమాచారం. అర్ష్ ఔలఖ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసిన పలువురు అభిమానులు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు. మరి సైలెంట్ గా వివాహం చేసుకోవడం వెనక గల కారణాలను మెహరీన్ తెలియజేస్తుందేమో చూడాలి మరి. మెహరీన్ సినిమాల విషయానికి వస్తే 2016లో కృష్ణగాడి వీర ప్రేమగాథ అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్, ఎఫ్2, చాణిక్య వంటి చిత్రాలలో నటించిన మెహరీన్ చివరిగా 2022లో ఎఫ్3 సినిమాలో మాత్రమే తెలుగులో నటించింది. ఆ తర్వాత మళ్లీ ఎటువంటి సినిమాలను ప్రకటించలేదు. మరి వివాహం అనంతరం సినిమాలలో నటిస్తుందో లేదో చూడాలి.