వెంకీ–తమన్ కాంబోకు ఇదే లాస్ట్ ఛాన్స్? ‘ఆదర్శ కుటుంబం’తో బాకీ తీర్చేస్తారా!
వెంకటేష్ మరియు తమన్ కలయికలో ఇప్పటివరకు నాలుగు సినిమాలొచ్చాయి. కానీ, విచారకరమైన విషయం ఏంటంటే.. ఈ కాంబినేషన్‌లో ఇప్పటివరకు ఒక్క ‘క్లీన్ బ్లాక్ బస్టర్’ కూడా పడలేదు.
బాడీగార్డ్: ఆశించిన స్థాయిలో ఆడలేదు.
షాడో & మసాలా: బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మిగిలాయి.
వెంకీ మామ: అబోవ్ యావరేజ్ మార్కుతో సరిపెట్టుకుంది.
సీనియర్ హీరో బాలయ్యకు ‘అఖండ’ వంటి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన తమన్, వెంకటేష్ విషయంలో మాత్రం ఎందుకో వెనుకబడ్డాడు. అందుకే ఇప్పుడు ‘ఆదర్శ కుటుంబం’తో ఆ బాకీని వడ్డీతో సహా తీర్చాలని తమన్ పట్టుదలతో ఉన్నాడు.
మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ఆశించిన ఫలితం అందుకోకపోయినా, అందులో తమన్ ఇచ్చిన ‘కుర్చీ మడతపెట్టి’ పాట దేశాన్ని ఊపేసింది. ‘అల వైకుంఠపురములో’ సినిమాతో తమన్ చేసిన మ్యాజిక్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పని చేస్తుండటంతో, వెంకటేష్ కోసం తమన్ తన కెరీర్‌లోనే బెస్ట్ ఆల్బమ్ ఇచ్చే అవకాశం ఉందని అభిమానులు నమ్ముతున్నారు. ప్రస్తుతం ట్యూన్స్ కంపోజింగ్ జరుగుతుండగా, త్వరలోనే రికార్డింగ్ పూర్తి చేసి సాంగ్ షూట్స్ ప్లాన్ చేయబోతున్నారు.
‘ఆదర్శ కుటుంబం’ షూటింగ్‌ను జూలైలోపు పూర్తి చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే 2027 సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా రిలీజ్ కావాలంటే, వెంకటేష్ కనీసం నాలుగు నెలలు ఆ సినిమాకు కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు త్రివిక్రమ్ టీమ్ పరుగులు పెడుతోంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం.వెంకటేష్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, త్రివిక్రమ్ మార్క్ మాటల మ్యాజిక్, తమన్ మార్క్ కిక్కిచ్చే మ్యూజిక్.. ఇవన్నీ కలిస్తే అక్టోబర్‌లో థియేటర్లలో జాతర ఖాయం. వెంకీ మామ తన కెరీర్‌లో మరో భారీ విజయాన్ని అందుకోవాలని, తమన్ తన ‘మ్యూజికల్ బాకీ’ని తీర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.