ముంబైలో అల్లు అర్జున్ హౌస్ రెంట్ నెల ఎంతో తెలుసా..?
అల్లు అర్జున్ ఈ ఫ్లాట్ కి భారీగానే డబ్బులు చెల్లిస్తున్నట్లు వినిపిస్తున్నాయి. మూడేళ్లకు గాను ఈ అపార్ట్మెంట్ కి ప్రతినెల రూ. 16 లక్షల రూపాయలు ఆ ఇంటికి రెంట్ కట్టనున్నారు. ఈ విషయం విన్న అభిమానులు , నేటిజన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. ముంబై జుహులో రెంట్స్ ఆ రేంజ్ లోనే ఉంటాయని మరి కొంతమంది నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాకా సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం కూడా ముంబైలోనే జరుగుతోంది. వీటికి తోడు డైరెక్టర్ లోకేష్ కనకరాజు సినిమా షూటింగ్ కూడా ముంబైలోనే ప్లాన్ చేస్తూ ఉండడంతో అల్లు అర్జున్ మూడేళ్ల పాటు ముంబైలోనే ఉండడానికి చూస్తున్నారు.
మరి అల్లు అర్జున్ ముంబైలో ఉండి బాలీవుడ్ హీరోలలో ఒకటిగా ఎదగాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. పుష్ప, పుష్ప 2 చిత్రాలతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించిన అల్లు అర్జున్ తన మార్కెట్ ను కూడా భారీగానే పెంచుకున్నారు. ఇప్పుడు తన తదు పరిచిత్రాల విషయంలో కూడా పక్క ప్లాన్ ప్రకారమే ముందుకు వెళుతున్నారు. ఏది ఏమైనాప్పటికీ అల్లు అర్జున్ సినిమాల కోసం మూడేళ్లు ఉండి వచ్చేస్తాడా !లేకపోతే కెరియర్ కోసం అక్కడే సెటిల్ అవుతారా అనే విషయం చూడాలి మరి. అలాగే హైదరాబాదులో కూడా రూ .100 కోట్ల రూపాయలతో ఇంటిని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.