టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. నిర్మాత చిట్టిబాబు మృతి..!
నిర్మాత చిట్టిబాబు ఆకస్మిక మరణం సినీ ఇండస్ట్రీలో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. సినీ సెలబ్రిటీలు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. చిట్టిబాబు అసలు పేరు వరప్రసాద్. ఈయన 1955 జులై 28న కృష్ణాజిల్లాలో గుడ్లవల్లేరులో జన్మించారు. అనంతరం చెన్నైలో చదువు పూర్తి చేసిన ఈయన తన తండ్రి ముద్దుగా పిలుచుకునేటువంటి చిట్టి పేరుతోనే ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక తండ్రి కూడా సినిమా ఇండస్ట్రీలో ఉండడంతో తన తండ్రి బాటలోనే అడుగు పెట్టారు. అలా అప్పలాచార్య, ఆత్రేయ వంటి చిత్రాలలో రచనశాఖలో అసిస్టెంట్ గా కూడా పనిచేశారు. అనంతరం సంతానం అనే చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమయ్యారు.
సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబుతో మంచి స్నేహబంధం ఉందని ఎన్నో సందర్భాలలో తెలియజేశారు. దాదాపుగా చిట్టి బాబు 12 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే 49 చిత్రాలకు కో-డైరెక్టర్ గా 30కు పైగా సినిమాలలో నటించారు. నిర్మాతగా కూడా పలు చిత్రాలను రూపొందించారు. ప్రముఖ నటి సౌందర్యాన్ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసింది చిట్టిబాబే . చిట్టిబాబు రాజకీయ విషయానికి వస్తే మొదట జనతా పార్టీలో 1998లో చేరారు. ఈయన వాజ్ పేయి, ఎల్కే అద్వానీ ,వెంకయ్య నాయుడు మరి కొంతమంది ప్రముఖులతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక చిట్టిబాబు అప్పుడప్పుడు పలు రకాల వివాదాస్పదమైన వార్తలలో కూడా నిలుస్తూ ఉంటారు.