ఫౌజి నుండి సాలిడ్ మాస్ ట్రీట్..ప్రభాస్ ఫ్యాన్స్ కి సడెన్ సర్ప్రైజ్ ఇది..!

Thota Jaya Madhuri
పాన్ ఇండియా స్థాయిలో అగ్రహీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్ ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. అందులో ముఖ్యంగా ప్రతిభావంతమైన దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ చిత్రం “ఫౌజీ” ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి హైప్ సంపాదించుకుంది. ఈ ప్రాజెక్ట్‌లో కొత్త హీరోయిన్ ఇమాన్వి ప్రభాస్ సరసన నటిస్తుండటం కూడా ఒక కొత్త ఫ్రెష్ ఫీలింగ్‌ను తీసుకువస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ వేగంగా కొనసాగుతోంది.

ఈ సినిమా కథాంశం దేశభక్తి నేపథ్యంతో ఉండబోతున్నప్పటికీ, ఇది కేవలం ఒక సాధారణ పేట్రియాటిక్ సినిమా కాకుండా, భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన విజువల్ ట్రీట్‌గా ఉండనుందని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఎలివేషన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్‌గా నిలవనున్నాయని సమాచారం. దర్శకుడు హను రాఘవపూడి ఇప్పటివరకు తన సినిమాల్లో చూపించిన సాఫ్ట్, ఎమోషనల్ టచ్‌కు భిన్నంగా ఈసారి పూర్తిగా మాస్ అప్రోచ్‌లో కథను చెప్పబోతున్నారట.ప్రభాస్ లాంటి భారీ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న హీరోను ఎలా ప్రెజెంట్ చేయాలో హను చాలా స్పష్టంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అభిమానులు ఆశించే విధంగా పవర్‌ఫుల్ ఎంట్రీలు, హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, థియేటర్లలో విజిల్స్ కొట్టించే ఎలివేషన్ సీన్స్ వేరే లెవల్. దీంతో ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమాకు సంగీతాన్ని విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు. ఆయన సంగీతం ఈ భారీ ప్రాజెక్ట్‌కు మరింత భావోద్వేగాన్ని, గొప్పతనాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించనుంది. ముఖ్యంగా పీరియాడిక్ సెట్టింగ్‌కు తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకంగా ఉండనుందని అంచనా.నిర్మాణ బాధ్యతలను ప్రముఖ నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ చేపట్టింది. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. విజువల్స్, యాక్షన్ డిజైన్, సెట్స్ వేరే లెవల్.

మొత్తానికి “ఫౌజీ” సినిమా ద్వారా హను రాఘవపూడి తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. ఇప్పటివరకు ఆయన చూపించిన సాఫ్ట్ లవ్ స్టోరీస్‌కు పూర్తి విరుద్ధంగా, ఈసారి మాస్ మరియు యాక్షన్‌తో కూడిన ఒక కొత్త అనుభూతిని అందించబోతున్నారు. అదే సమయంలో ప్రభాస్ అభిమానులకు కూడా ఇది ఒక ఫెస్టివల్ మూవీగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌పై వస్తున్న బజ్‌ను చూస్తుంటే, విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విడుదలైన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: