జననాయగన్ సినిమా లీక్ చేసింది వారేనా.. కీలక నిందితులు అరెస్టు..!
అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన కథనం ప్రకారం ఈ కేసులో పట్టుబడిన ప్రధాన నిందితులు ఒక ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేశారని, అతను మరో సినిమా ఎడిటింగ్ పనుల కోసం స్టూడియో కి వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్న జననాయగన్ చిత్రానికి సంబంధించి రీల్స్ ని అనధికారికంగా యాక్సిస్ చేసి మరి దొంగలించినట్లు తెలియజేశారు. అయితే అలా దొంగలించిన డేటాను తన సహచరులకు కూడా పంపించినట్లు దర్యాప్తులో తేలింది. దీనివల్లే సినిమా ఇంటర్నెట్లో సర్కులేట్ అయ్యిందనే విధంగా అధికారులు తెలియజేస్తున్నారు.
ఇక ఇదే కేసులోనే గతంలో కూడా 6 మందిని అరెస్టు చేయగా ఇప్పుడు మరో ముగ్గురు కీలకమైన సూత్రధారులను ఆరెస్ట చేశారు. వీరి వద్ద ఉన్న డిజిటల్ సాక్షాధారాలను పరిశీలించిన అనంతరం వీరిని కోర్టులోకి హాజరు పరచబోతున్నారు. ఫైబర్ క్రైమ్ విభాగం చేపట్టిన ఈ దర్యాప్తుకు చిత్ర బృందం అభినందనలను తెలియజేసింది. ఈ ఘటన వల్ల ప్రజలకు సైబర్ క్రైమ్ విభాగం నుంచి మరింత హెచ్చరికను జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో పైరసీ కంటెంట్ ని ఎవరైనా సరే డౌన్లోడ్ చేయడం స్ట్రీమింగ్ చేయడం, షేర్ చేయడం వంటివి చేస్తే కచ్చితంగా వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు. ఎక్కడైనా పైరసీ కంటెంట్ లేదా అనుమానాస్పద లింకులు కనిపించినట్లు అయితే 1930 నెంబర్ కి చెప్పవచ్చని సైబర్ క్రైమ్ టీం తెలియజేసింది.