ఆ ఫోటోలో ఉన్నది నేను కాదు..ఎట్టకేలకు రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ భార్య..!
అయితే ఆ ఫోటోలో ఉన్నది అన్నా లెజినోవా అని అందరూ అనుకున్నారు. కానీ ఆ ఫోటోలో ఉన్నది తాను కాదు అంటూ తాజాగా క్లారిటీ ఇచ్చింది ఆ ఫోటోలోని ఉండే అమ్మాయి పేరు డానా మార్క్స్ అని తెలియజేసింది. చాలా మంది ఈ విషయంలో పొరపాటుగా తన పేరును ప్రచారం చేస్తున్నారని ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చింది. అలాగే ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి కూడా తెలియజేస్తూ తాను ఎప్పుడూ మోడల్ గా కానీ నటిగా గాని పనిచేయలేదంటూ తెలియజేసింది అన్నా లెజినోవా.
తీన్ మార్ సినిమాస్ లో ఒక పాటలో తాను కేవలం కొన్ని సెకన్లు మాత్రమే కనిపించానని పవన్ కళ్యాణ్ తో తనకి ఉన్న అనుబంధం గురించి ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు ఇలా ఓపికగా సమాధానాలను తెలియజేసింది. తమ వివాహానికి ముందు జరిగిన విశేషాలను ఇలా అభిమానులకు తెలియజేస్తోంది. ఇక ముందుగా వీరిద్దరిలో ఎవరు తమ ప్రేమను వ్యక్తపరిచారనే విషయం పైన కూడా అన్నా లెజినోవా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్వయంగా తనకి మొదట ప్రపోజ్ చేశారంటూ తెలియజేసింది. ఇలా అన్నా లెజినోవా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు మరింత దగ్గర అవుతూ ఉండడంతో అటు అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.