అక్కినేని హీరోతో డైరెక్టర్ మారుతి మూవీ..?
లెనిన్ సినిమాని వచ్చే నెలలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలోనే డైరెక్టర్ మారుతి తో అఖిల్ నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్ లో గట్టిగా గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య ఇప్పటికే స్టోరీ పరంగా చర్చలు జరిగినట్లుగా వినిపిస్తున్నాయి. గతంలో అక్కినేని నాగచైతన్య తో శైలజా రెడ్డి అల్లుడు అనే కమర్షియల్ సినిమాని తెరకెక్కించారు. దీంతో అక్కినేని హీరోల బాడీ లాంగ్వేజ్ ని డైరెక్టర్ మారుతి డీల్ చేసే విధానం కూడా అందరిని బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే అఖిల్ కోసం ఒకపక్క కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమా స్టోరీ సిద్ధం చేసినట్లుగా వినిపిస్తోంది. డైరెక్టర్ మారుతి కథలే కాకుండా మరో కొంతమంది యువ దర్శకులతో కూడా అఖిల్ కథలు వింటున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే డైరెక్టర్ మారుతి తక్కువ బడ్జెట్ సినిమాలతో తెరకెక్కిస్తారు అలాగే సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉండటంతో అఖిల్, మారుతి సినిమాకి ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ మారితి ప్రభాస్ తో తెరకెక్కించిన చిత్రం రాజాసాబ్ ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో నిలిచింది. అందుకే ఈసారి ఒక బ్లాక్ బాస్టర్ తో సాలిడ్ కం బ్యాక్ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు అందుకే హీరో అఖిల్ కి కథ చెప్పగా మరి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో మరికొద్ది రోజులలో తేలింది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఓకే గనుక అయితే అక్కినేని అభిమానులకు పండగే అని చెప్పవచ్చు.