ఆ సమయంలో చనిపోవాలనుకున్న.. నటి హేమ షాకింగ్ కామెంట్స్..!

Divya
టాలీవుడ్ లో సీనియర్ నటిగా పేరు సంపాదించిన హేమ అందరికీ సుపరిచితమే. గత కొంతకాలంగా హేమ డ్రగ్స్ కేసు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంది. అయితే ఈ విషయం పైన మొదటిసారి బహిరంగంగానే స్పందించింది హేమ. ఇటీవల ఈ కేసులో కూడా ఆమెకు క్లీన్ చీట్ ఇచ్చింది కోర్టు , అయినా కూడా ఈమె పైన ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. సోమవారం తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఆమె మాట్లాడుతూ.. డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు తనని చాలా కుంగదీసేలా చేశాయని ఎమోషనల్ గా మాట్లాడింది.


ఒకానొక దశలో ఈ విషయాలన్నీ భరించలేక చనిపోదామనే నిర్ణయం కూడా తీసుకున్నాను అంతలా మానసికంగా తనను వేధించారని తెలియజేసింది. తాను ఎప్పుడూ కూడా తప్పు చేయలేదనే విషయాన్ని గట్టిగా నమ్ముతాను అందుకే న్యాయపోరాటం చేసి చివరికి కోర్టులో తాను నిర్దోషిగా బయటపడ్డాను అంటూ తెలిపింది హేమ. కొన్ని మీడియా సంస్థలు అసలు వాస్తవాలు తెలుసుకోకుండానే తమ పైన బురద జరుగుతున్నాయని ఆరోపణలు చేసింది. ఈ తప్పుడు వార్తల వల్ల తన వ్యక్తిగత జీవితమే కాకుండా కుటుంబ సభ్యులు జీవితం కూడా సమాజంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపింది.


తన కుటుంబ సభ్యులు అనుభవించిన నరకం అంతా అంతా కాదని కానీ నిజాయితీగా ఉండే మీడియా తన పక్షాన నిలుస్తుందనే నమ్మకం కూడా తనకి ఉండేదని తెలిపింది హేమ. నటిగా దశాబ్ద కాలం పాటు ప్రేక్షకులను అలరించిన హేమ ఈ వివాదం నుంచి బయటపడినప్పటికీ తన కెరియర్ పైన ప్రస్తుతం దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. తనమీద నమ్మకం ఉంచిన వారికి భవిష్యత్తులో కూడా తాను అండగా ఉంటానంటూ భరోసా కల్పిస్తానని తెలిపింది హేమ. మరి రాబోయే రోజుల్లో అవకాశాలు అందుకుంటుందో లేదో చూడాలి మరి. ప్రస్తుతం హేమ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: