సినీ ఇండస్ట్రీలో విషాదం.. నటుడు తల్లి మృతి..!

Divya
సినీ ఇండస్ట్రీలో విలక్షణమైన  నటుడుగా తనకంటూ పేరు సంపాదించిన ప్రకాష్ రాజ్ ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరి నటిస్తారు. అంతేకాకుండా సమాజంలో జరిగేటువంటి ఎలాంటి విషయాలైనా సరే మొహమాటం లేకుండా ప్రశ్నిస్తుంటారు. తాజాగా ప్రకాష్ రాజ్ తల్లి శ్రీమతి సువర్ణలత కన్నుమూశారు. ఈరోజు సాయంత్రం బెంగళూరులో అంతక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. గత కొంతకాలంగా సువర్ణలత వయోభార సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఈరోజు ఉదయం బెంగళూరులో తన స్వగృహంలోని సువర్ణలత కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రకాష్ రాజ్ ఇంట విషాదఛాయలు నెలకొన్నాయి. ఈ విషయం తెలిసి పలువురు అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజు తల్లికి సంతాపం తెలియజేస్తున్నారు.


పలువురు సినీ ప్రముఖులు రాజకీయ వేతలు కూడా ప్రకాష్ రాజ్ తల్లి మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రకాష్ రాజ్ తల్లీ మరణానికి సంతాపం తెలియజేశారు. నటుడు శ్రీ ప్రకాష్ రాజు గారి మాతృమూర్తి శ్రీమతి సువర్ణలత కన్నుమూశారని  తెలిసి చింతిస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇందుకు సంబంధించి ట్విట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ప్రకాష్ రాజ్ సినీ కెరియర్ విషయానికి వస్తే 1988లో మొదటిసారిగా తన సిని కెరియర్ని మొదలుపెట్టిన  ప్రకాష్ రాజ్ తెలుగులో సంకల్పం అనే సినిమాతో కన్నడ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నో మలయాళం, కన్నడ, తెలుగు చిత్రాలలో నటించి నటుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. అలాగే ఎన్నో వెబ్ సిరీస్లలో కూడా నటించి ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే.. జననాయగన్, గూడచారి 2, వారణాసి, డేకాయిట్, స్పిరిట్, మిరాకిల్ తదితర చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. అలాగే కన్నడలో కూడా రెండు మూడు చిత్రాలలో నటిస్తున్నట్లు సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: