రామ్ చరణ్ కు గాయం పై.. క్లారిటీ ఇచ్చిన పెద్ది టీమ్..!
అయితే తాజాగా చిత్ర బృందం మాత్రం ఈ విషయం పైన స్పందిస్తూ క్లారిటీ ఇవ్వడంతో కొంతమేరకు మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరుగుతున్న సినిమా షూటింగ్లో భాగంగా హై ఇంటెన్సిటీ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, మంగళవారం జరిగిన షూటింగ్లో రామ్ చరణ్ ఎడమ కంటి పైన చిన్న కోతపడింది. వెంటనే వైద్యులు స్పందించి ఆయనకు చికిత్స అందించారని, అదృష్టవశాత్తు రామ్ చరణ్ కంటికి ఎలాంటి ప్రమాదం జరగలేదంటూ వైద్యులు ధ్రువీకరించాలని తెలిపారు.
రెండు రోజులు పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని, షూటింగ్ ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతోనే రామ్ చరణ్ రేపటి నుంచి సినిమా షూటింగ్ సెట్లోకి అడుగుపెట్టబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అంతా క్షేమంగా ఉంది షూటింగ్ యధావిధిగా కొనసాగుతోంది అంటూ అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది. సోషల్ మీడియాలో వచ్చిన అనవసరపు ఊహాగానాలను ఎవరు నమ్మద్దు అంటూ టీమ్ కోరింది. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్గా విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి దశలో షూటింగ్ ఉన్నది. ఇక ఈ సినిమాకి సంబంధించి త్వరలోనే ఒక స్పెషల్ సాంగ్ కూడా షూటింగ్ మొదలు పెట్టేలా ప్లాన్ చేశారు డైరెక్టర్.