దృశ్యం 3 ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. సినిమా వాయిదా..?

Divya
మలయాళంలో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం దృశ్యం. ఈ సినిమా ఎన్నో భాషలలో రీమేక్ చేయగా అన్ని భాషలలో కూడా మంచి విజయాలను అందుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ క్రియేటివ్ సినిమా రెండు భాగాలుగా ఆడియన్స్ ను ఒరేంజ్ లో అలరించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా దృశ్యం 3 త్వరలోనే రాబోతోంది మళయాల స్టార్ హీరో మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. మలయాళ ఆడియన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు.


అయితే ఇప్పుడు అలాంటి అభిమానులకు నిరాశ ఎదురైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా ప్రస్తుతం ఈ సినిమా వాయిదా వేసినట్లు అధికారికంగా ప్రకటన చేశారు చిత్ర బృందం. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ వల్ల సినిమా పైన అంచనాలు పెంచినప్పటికీ ప్రస్తుతం పశ్చిమ ఆసియా దేశాలలో జరుగుతున్న ఉద్రిక్త యుక్త పరిస్థితి వల్ల నిర్మాతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


మలయాళ చిత్రాలకు గల్ఫ్ దేశాలలో మంచి ఆదాయం వస్తుంది కనుక ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల థియేటర్ల వద్ద ప్రజలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్న కాబట్టి భారీ బడ్జెట్ తో అంతర్జాతీయ స్థాయిలో విడుదల కాబోతున్న సినిమాలన్నీ కూడా రిస్కు తీసుకోవడం ఇష్టం లేక వాయిదా వేస్తున్నారు. దీంతో దృశ్యం3 సినిమా కూడా ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు. ఈ విషయం విన్న ఆడియన్స్ కూడా కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. హీరో యష్ నటించిన టాక్సిక్ సినిమా కూడా యుద్ధ వాతావరణం వల్ల పోస్ట్ పోన్ చేశారు. మరి ఈ పరిస్థితులని చక్కదిద్దడానికి కనీసం  రెండు నెలలైనా సమయం పట్టేలా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: