బాలయ్య అభిమానులకు అదిరిపోయే శుభవార్త.. ఆ ప్రాజెక్ట్ లో నటిస్తారా?
నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒక క్రేజీ కాంబినేషన్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో ఒక భారీ చిత్రం రూపుదిద్దుకోబోతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. సాధారణంగానే బాలయ్య సినిమా అంటే మాస్ జాతరలా ఉంటుంది, దానికి తోడు హరీష్ శంకర్ లాంటి దర్శకుడు తోడైతే డైలాగ్స్ మరియు ఎనర్జీ వేరే లెవల్‌లో ఉంటాయని ఫ్యాన్స్ అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు.
హరీష్ శంకర్ గతంలోనే బాలకృష్ణకు ఒక పవర్ ఫుల్ లైన్ వినిపించారని, దానికి బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇటీవల కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతోంది, ఇప్పుడు బాలయ్యతో సినిమా అంటే కచ్చితంగా ఇది ఒక భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ అని చెప్పక తప్పదు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తుండగా, హరీష్ శంకర్ కూడా తన ప్రస్తుత ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరి షెడ్యూల్స్ సెట్ అవ్వగానే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. బాలయ్య మార్క్ యాక్షన్, హరీష్ శంకర్ మార్క్ మాస్ ఎలివేషన్స్ కలగలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల వారీగా సమస్యలు, ఎమ్మెల్యేల పనితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్రజల ఇబ్బందులు, అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితులు, రాజకీయ అంశాలపై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.