రవితేజ ఇరుముడి మూవీ.. ఆ సినిమా రీమేక్సేనా..?
ఈ ఫస్ట్ లుక్ లో రవితేజ అయ్యప్ప దీక్షలో నెత్తిమీద ఇరుముడి పెట్టుకొని మరి చిన్నారిని ఎత్తుకున్నట్టు ఒక పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ఆశ్చర్యపరచడంతో ఈ సినిమా పైన మరింత ఆసక్తి అభిమానులకు పెరిగింది. ఈ సినిమా రీమేక్ అంటూ పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 2022లో మలయాళంలో ముకుందన్ హీరోగా నటించిన మాలికాపురం అనే సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా స్టోరీ ఇద్దరు చిన్నారులు అయ్యప్ప దీక్ష తీసుకొని శబరిమలలో ఉండే అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు సహాయపడిన హీరో కథ. ఓటీటిలో కూడా మంచి విజయాన్ని అందుకుంది.
ఇప్పుడు రవితేజ ఇరుముడి సినిమా కూడా మాలికాపురం సినిమాకు రీమేక్ అన్నట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అలాగే 2022లో మలయాళంలో వచ్చిన కుమారి సినిమా హర్రర్ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు కుమారి సినిమా, మాలికాపురం సినిమాను కలిపి తండ్రి, కూతుర్ల ఎమోషన్ తో ఈ చిత్రాన్ని సరికొత్తగా తెరకెక్కిస్తున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇరుముడి సినిమా రీమేక్ సినిమానా? లేకపోతే ఏదైనా కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నార ?అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ ఏడాది ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఇందులో ప్రియ భవాని శంకర్ హీరోయిన్గా నటిస్తోంది.