వామ్మో: కీర్తి సురేష్ ఇంటిని చూశారా.. ఆ ఒక్కటి చాలా స్పెషల్.. వీడియో వైరల్..!

Divya
టాలీవుడ్ ,కోలీవుడ్లో అందం అభినయంతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. మలయాళంలో గీతాంజలి అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మహానటి సినిమాతో ఏకంగా జాతీయ అవార్డు అందుకోవడంతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అలా భాషతో సంబంధం లేకుండా ఎన్నో చిత్రాలలో నటిస్తున్న కీర్తి సురేష్ దాదాపుగా 15 ఏళ్ల పాటు రిలేషన్షిప్ లో ఉన్న చిన్ననాటి స్నేహితుడిని 2024లో తన ప్రియుడు ఆంటోని ని ప్రేమించి వివాహం చేసుకుంది.

వివాహం ఆనంతరం సినిమాలలో యాక్టివ్ గా ఉన్న కీర్తి సురేష్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అలరిస్తోంది. తాజాగా తమ ఇంటిని అభిమానుల కోసం తన భర్తతో కలిసి హోంటూర్ చేసిన వీడియోని షేర్ చేసింది. కొచ్చిలో తాము నివాసం ఉంటున్న ఇంటి గురించి పలు విషయాలను తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. తన ఇంట్లో తన ఫ్యామిలీ ఫొటోస్ ,పెళ్లి ఫోటోలతో పాటు మహానటి సినిమాకి గాను తనకు వచ్చిన జాతీయ అవార్డును , అలాగే తన మీద వచ్చిన వార్తల కథనాల పేపర్లను సైతం కీర్తి సురేష్ చూపించింది.


కీర్తి సురేష్ తన సినీ ప్రయాణం అందమైన జ్ఞాపకాలు అనుభవాలకు సంబంధించి మెమొరీని కూడా ఇందులో చూపించింది. ఇదే తన ఇంటిలో ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచిందని చెప్పవచ్చు. అలాగే తాను పెంచుకుంటున్న కుక్కలకు కూడా సపరేట్ రూమ్ ని ఏర్పాటు చేసింది. సాంప్రదాయమైన ఇంటీరియర్ డిజైన్ తో పాటుగా బాల్కనీ మొత్తం మొక్కలతో చాలా అందంగా డెకరేట్ చేసింది కీర్తి సురేష్. ప్రస్తుతం కీర్తి సురేష్ షేర్ చేసిన ఈ వీడియో చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కీర్తి సురేష్ సినీ కెరియర్ విషయానికి వస్తే.. గత ఏడాది ఉప్పుకప్పురంబు, రివాల్వర్ రీటా వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించలేకపోయింది. ప్రస్తుతం తమిళంలో మలయాళంలో ఒక్కొక్క సినిమాలో నటిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ నటిస్తున్న రౌడీ జనార్ధన్ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: