ఏంటి: ఫరియా అబ్దుల్లా ప్రేమలో పడిందా..?

Divya
టాలీవుడ్ లోకి జాతి రత్నాలు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్ కే మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రావణాసుర, ఆ ఒక్కటి అడక్కు, కల్కి, మత్తు వదలరా 2 , అనగనగా ఒక రాజు వంటి చిత్రాలలో నటించింది. నిరంతరం సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో మరింత ఆకట్టుకుంది. ముఖ్యంగా నటన, డాన్స్, పాటలతో మల్టీ టాలెంటెడ్ హీరోయిన్గా పేరు సంపాదించింది.


తాజాగా ఫరియా అబ్దుల్లా ప్రేమలో ఉన్నాననే విషయాన్ని  అధికారికంగా ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన రిలేషన్ షిప్ పై మాట్లాడుతూ.. తాను ఒక హిందూ అబ్బాయితో డేటింగ్ లో ఉన్నాను అంటూ తెలియజేసింది. ఇండస్ట్రీలోనే ఉంటూ తన వ్యక్తిగత జీవితాన్ని, తన వృత్తిని కూడా బ్యాలెన్స్ చేసుకోవడం వెనుక తన ప్రియుడి ప్రోత్సాహం చాలా ఉందని తెలియజేసింది. కానీ  ఫరియా అబ్దుల్లా బాయ్ ఫ్రెండ్ పేరు మాత్రం చెప్పలేదు. ఆ వ్యక్తి సినీ పరిశ్రమకు చెందిన ఒక యంగ్ కొరియోగ్రాఫర్ కావడం గమనార్హం.


తామిద్దరం కలిసి పని చేస్తున్నామని తనలో దాగున్న డాన్స్ మ్యూజిక్ టాలెంట్ ని కూడా వెలికి తీయడంలో తన ప్రియుడు పాత్ర చాలా కీలకమని తెలియజేసింది. ముస్లిం మతానికి చెందిన ఫరియా, హిందూ అబ్బాయితో ప్రేమలో ఉండడం పైన స్పందిస్తూ.. మా బంధాన్ని కేవలం ఒక లవ్ అఫైర్ గా మాత్రం చూడనని, ఇది ఒక బలమైన పార్ట్నర్షిప్ అంటూ తెలియజేసింది. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఫరియా అబ్దుల్లా కెరీర్ ను మలుపు తిప్పింది తన ప్రేమికుడని డైరెక్ట్ గా చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి రాబోయే రోజుల్లో తన ప్రియుడిని అభిమానులకు పరిచయం చేస్తుందేమో చూడాలి మరి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: