చంద్రబాబు వల్లే ఆ సినిమా పెద్ద హిట్ అవ్వలేదు..అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్.!

Pandrala Sravanthi
ఏంటి అనిల్ రావిపూడి డైరెక్షన్ చేసిన సినిమా చంద్రబాబు వల్లే హిట్ కాలేకపోయిందా.. ఇంతకీ చంద్రబాబు వల్ల హిట్ కానీ ఆ సినిమా ఏంటి.. ఎందుకు అనిల్ రావిపూడి ఇలాంటి కామెంట్స్ చేశారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. తాజాగా సంక్రాంతికి వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ హిట్ కావడంతో ఫుల్ హ్యాపీలో మునిగిపోయారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన ఏ సినిమా తీసినా చాలు మినిమం హిట్ గ్యారెంటీ అనే టాక్ వినిపిస్తోంది.అనిల్ రావిపూడి ఇప్పటివరకు చేసిన ఏ సినిమా కూడా ఫ్లాప్ కాలేదు. అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్.. అంతేకాకుండా రీసెంట్గా చేసే సినిమాలు 2-3 వందల కోట్ల కలెక్షన్స్ కూడా దాటడంతో ఈయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలతో పాటు హీరో హీరోయిన్లు కూడా ఎగబడుతున్నారు.


అలా అనిల్ రావిపూడి సినిమాకి నిర్మాతగా చేస్తే కచ్చితంగా కోట్ల కలెక్షన్స్ వస్తుందనే నమ్మకం కూడా నిర్మాతలలో వచ్చేసింది.ఇదిలా ఉంటే తాజాగా మన శంకర వరప్రసాద్ గారు మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావిపూడి ఆ సినిమా చంద్రబాబు గారి వల్లే పెద్ద హిట్ కాలేక పోయింది అంటూ చెప్పుకొచ్చారు. మరి ఇంతకీ ఆ సినిమా ఏంటయ్యా అంటే బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి.. బాలకృష్ణ, కాజల్ అగర్వాల్,శ్రీలీల కాంబోలో వచ్చిన భగవంత్ కేసరి సినిమా ఓ మోస్తారు హిట్ అయింది. అయితే ఈ సినిమా అనిల్ రావిపూడి అనుకున్నంత హిట్ కాలేదట. బాలకృష్ణ కోసం చాలా స్పెషల్ గా అనిల్ రావిపూడి స్క్రిప్ట్ రాసుకున్నప్పటికీ ఈ సినిమా విడుదల సమయంలో చంద్రబాబు నాయుడు జైలు కి వెళ్లడంతో చాలామంది బాలయ్య అభిమానులు నిరాశలో మునిగిపోయారట.


ఎక్కువగా ఆసక్తి చూపించలేదట.ఒకవేళ ఆ సమయంలో చంద్రబాబు గారు జైలుకు వెళ్లకపోయి అంటే తన సినిమా చాలా పెద్ద హిట్ అయ్యేదని, నా కెరియర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ స్క్రిప్ట్ రాసానని, కానీ చంద్రబాబు నాయుడు అరెస్టుతో బాలయ్య ఫ్యాన్స్ నిరాశలో మునగడం వల్ల సినిమాని ఎక్కువగా ఆదరించలేదని, మిగిలిన ప్రేక్షకులు ఈ సినిమాని చూడడంతో ఓ మోస్తరు హిట్ అయింది.కానీ నేను అనుకున్నంత పెద్ద హిట్ అయితే కాలేదు. పరిస్థితులు అనుకూలించి ఉంటే అతి పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేదని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: