అఖండ 2లో స‌నాత‌న హైంద‌వం ధ‌ర్మం అద్భుతం: శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే టాలీవుడ్ లో ఏ స్థాయిలో అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన సింహా - లెజెండ్ - అఖండ మూడు సినిమాలు ఒక దానిని మించి మ‌రొక‌టి హిట్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే వీరి కాంబినేష‌న్ లో వ‌చ్చిన అఖండ 2 - తాండ‌వం పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా లో బోయ‌పాటి శ్రీను చెప్పిన , చూపించిన స‌నాతన ధ‌ర్మం కాన్సెఫ్ట్ కు అన్ని వ‌ర్గాల నుంచి ప్ర‌శంస‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమాను జాతీయ స్తాయిలో ప‌లువురు ప్ర‌ముఖులు చూశారు. విశ్వ హిందూ ప‌రిష‌త్ నుంచి అశోక్ సింఘాల్ లాంటి ప్ర‌ముఖులు సైతం ఈ సినిమా చూసి ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మ‌రో ప్ర‌ముఖ వ్య‌క్తి సైతం అఖండ 2 సినిమాను ప్ర‌శంసించారు.


ఈ క్ర‌మంలో నే ‘అఖండ–2’. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామివారు మరియు శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిలం స్వామివారు 400 మంది వేద పాఠశాల విధ్యార్థులతో కలిసి హైదరాబాద్‌లో అఖండ–2  సినిమాని శనివారం వీక్షించారు. బాలకృష్ణ రుద్రుడిగా చేసిన అఖండ తాండవాన్ని చూసిన తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీనుని ఆశీర్వదించి సన్మానించారు. సన్మానం తర్వాత శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామివారు మాట్లాడుతూ–‘‘ ఎంతో బాధ్యతతో కూడిన చిత్రాన్ని తీశారని మీరు తీసిన ఈ చిత్రం ద్వారా హైందవ ధర్మాన్ని అందరికి అర్థమయ్యేలాగా, బలంగా చెప్పారని దర్శకుడు బోయపాటి శ్రీను ని ప్రశంసించారు. బోయ‌పాటి స‌నాత‌న ధ‌ర్మం గురించి చాలా గొప్ప‌గా చూపించార‌ని .. బోయ‌పాటి చెప్పిన స‌నాత‌న ధ‌ర్మం మ‌న దేశ గొప్ప‌త‌నాన్ని .. ఔన్న‌త్యాన్ని చాటి చెప్పేలా ఉందంటూ ప్ర‌శంస‌లు కురిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: