డైరెక్టర్ మారుతి జర్నీ: రూ.50 లక్షలతో సినిమా రూ.10 కోట్ల లాభం..?

Divya
టాలీవుడ్ డైరెక్టర్ మారుతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ బడ్జెట్ తో అత్యధిక లాభాలు తీసుకువచ్చే చిత్రాలను తెరకెక్కిస్తూ ఉంటారు. ప్రస్తుతం ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ సినిమా జనవరి 12వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది. ఇటువంటి సందర్భంలోనే డైరెక్టర్ మారుతి గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


మారుతి ఫ్యామిలీ:
ముఖ్యంగా డైరెక్టర్ మారుతి కుటుంబం చాలా పేద కుటుంబమని, తండ్రి బండ్ల మీద అరటి పండ్లు అమ్మేవారు, తల్లి  టైలరింగ్ పని చేసేవారు. మారుతి ఇంటర్ పూర్తి అయిన తర్వాత బందర్ రోడ్ లో ఒక నెంబర్ ప్లేట్ షాప్ లో పనిచేశారట. అలా పని చేస్తూనే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి, హైదరాబాదులో తన అక్క ఇంట్లో ఉంటూనే యానిమేషన్ కోర్సులు చేరారు. డైరెక్టర్ మారుతికి బొమ్మలు వేయడం అంటే చాలా ఇష్టం అని అందుకే  ఖాళీ సమయం దొరికినప్పుడల్లా బస్సుల్లో బస్ స్టాప్ లలో ఎక్కువగా స్కెచ్చింగ్ వేసేవారు.


అల్లు అర్జున్-  మారుతి స్నేహం:

యానిమేషన్ కోర్స్ నేర్చుకునేందుకు అల్లు అర్జున్ కూడా మారుతి దగ్గరికి వచ్చేవారు. అప్పటికి అల్లు అర్జున్ హీరో కాలేదు. అలా అల్లు అర్జున్, మారుతి మంచి స్నేహితులు అవడంతో, ఆ స్నేహం వల్ల మారుతికి బన్నీవాసుని పరిచయం చేశారు అల్లు అర్జున్. ఆర్య సినిమా విడుదల సమయంలో డిస్ట్రిబ్యూటర్ గా మారుతికి ఒక అవకాశం కల్పించారు బన్నీ వాసు. ఆ తర్వాత ఏ ఫిలింబై అరవింద్, ప్రేమిస్తే వంటి చిత్రాలతో పాటు పలు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా కూడా చేశారు. యాడ్స్ చేస్తూనే, చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ లోగో, ప్రచార ప్రకటనల కోసం మారుతి పనిచేశారు.


డైరెక్టర్ ఎలా అయ్యారంటే:

అటువంటి సందర్భంలోని డైరెక్టర్ అవ్వాలని నిర్ణయించుకొని బస్ స్టాప్ సినిమా కథ రాసుకొని, నిర్మాతల కోసం తిరగగా బెల్లంకొండ సురేష్ ఒప్పుకున్నారు. నటీనటుల ఎంపిక చేసినప్పటికీ సినిమా షూటింగ్ మొదలవ్వకముందే ఆగిపోయింది. ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి ఒక బ్యానర్ మొదలుపెట్టి ఆ బ్యానర్లో ఈ రోజుల్లో అనే టైటిల్ తో తన మొదటి సినిమాని తెరకెక్కించారు. రూ. 50 లక్షల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించి ఈ సినిమాని 2012లో విడుదల చేయగా రూ. 10 కోట్ల రూపాయల పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత బస్ స్టాప్ సినిమా తెరకెక్కించి  విడుదల చేయగా అది కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ప్రేమ కథా చిత్రమ్  తెరకెక్కించి విడుదల చేయగా  రూ.20 కోట్ల వరకు రాబట్టింది అలా భలే భలే మగాడివోయ్, మహానుభావుడు తదితర చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ మారుతి ఇప్పుడు ఏకంగా ప్రభాస్ తో కలిసి రాజాసాబ్ సినిమాని తెరకెక్కించే స్థాయికి ఎదిగారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని అభిమానులు నమ్ముతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.


డైరెక్టర్ మారుతి భార్య పేరు స్పందన, వీరి వివాహం 2003లో జరిగింది. వీరికి ఒక కూతురు ,కొడుకు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: