అఖండ - 2 కు అప్పటి వరకు బ్రేకుల్లేవ్ .. !
ఈ ఏడాది విడుదలైన సినిమాలు చాలా వరకు రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చాయి. టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ–2’ సినిమా డిసెంబర్ 5న విడుదల కావాల్సింది. కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల ఆ సినిమా డిసెంబర్ 12న విడుదలవ్వటం అందరికి తెలిసిందే. సినిమా విడుదలైన తర్వాత సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ సనాతన ధర్మానికి, భారతదేశ ఔన్నత్యానికి, దర్శకుడు బోయపాటి శ్రీను బాలకృష్ణను సూపర్‌మ్యాన్‌గా చూపించిన తీరుకు హ్యాట్సాఫ్ అన్నారు. శివభక్తులైతే పూనకాలతో ఊగిపోయారు. సినిమా చూసి ఇది తమ సినిమా అంటూ బాలయ్యను శివునిగా ఊహించుకుని పొంగిపోయారు.
హిందూ ధర్మాన్ని ఆరాధించే భక్తులందరూ నిండుమనసుతో ఆశీర్వదించారు. ఏదేమైనా ఎవరేమనుకున్నా ఒక సినిమా విడుదలవ్వాల్సిన సమయంలో విడుదలవ్వకుండా వాయిదా పడితే కలెక్షన్ల పరంగా రెవెన్యూ దాదాపు 20 శాతం వరకు మైనస్ అవ్వటం ఖాయం. అదే ఈ సినిమా విషయంలో జరిగింది. ఇప్పటికే ‘ అఖండ – 2 ’ సినిమా విడుదలైన కొన్ని కేంద్రాలలో సేఫ్‌గా నిలిచింది. మరికొన్ని చోట్ల ఇంకా రన్ అవుతుంది. జనవరి 1 నుంచి టిక్కెట్ రేట్లు కూడా తగ్గినా కూడా ఈ వీకెండ్ లో అఖండ 2 వసూళ్ల వర్షం కురుస్తోంది.
ఈ నెల 9న ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా విడుదలయ్యేవరకు ఈ సినిమా రన్ ఇలానే ఉంటే అందరూ సేఫ్‌గా బయటపడతారని ట్రేడ్ వర్గాలు చర్చించు కుంటున్నాయి. ఏదేమైనా బాలయ్య కెరీర్ లో అఖండ 2 వరుసగా ఐదో విజయంగా నమోదు చేసింది. అఖండ - వీరసింహా రెడ్డి - భగవంత్ కేసరి - డాకూ మహారాజ్ - అఖండ 2 - తాండవం హిట్ల తో బాలయ్య ఫుల్ స్వింగ్ తో దూసుకు పోతున్నారు.