ప్రభాస్ జోకర్ లుక్.. రాజాసాబ్ 2 పై నోరుజారిన డైరెక్టర్ మారుతి..?

Divya
పాన్ ఇండియా హీరో ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో జనవరి 9వ తేదీన విడుదల కాబోతున్న చిత్రం ది రాజాసాబ్. ఈ చిత్రంలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటించారు. భారీ గ్రాఫిక్స్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా పైన ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా మరింత హైప్ తీసుకువచ్చింది. టైలర్ చివరిలో ప్రభాస్ జోకర్ లుక్ హైలెట్గా నిలిచింది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్లో విడుదలవుతుందా అని అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు.


తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న చిత్ర బృందంతో పాటు డైరెక్టర్ మారుతీ వరుస ఇంటర్వ్యూలలో  పాల్గొన్నారు. ఈ సమయంలోనే తనకు తెలియకుండా రాజా సాబ్ సినిమా నుంచి ఒక పెద్ద అప్డేట్ ఇచ్చారు. ముఖ్యంగా ప్రభాస్ కనిపించిన జోకర్ లుక్ గురించి , ఆ పాత్రని చేయడానికి ఎలా ఒప్పించారని ప్రశ్నించగా? అందుకు డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. ప్రభాస్ జోకర్ లుక్ లో కనిపించడానికి ఒక పెద్ద కథ ఉందని, రాజా సాబ్ పార్ట్ 2లో కూడా ఈ పార్ట్ ఉంటుందని తెలియజేశారు.


జోకర్ లుక్కు సంబంధించి సినిమాలో  ప్రాధాన్యత ఉండే విషయంపై ప్రభాస్ కి వివరించానని, అది విన్న తర్వాతే ఆయన ఒప్పుకున్నాడు అంటూ చెప్పుకొచ్చారు. అలా మొత్తానికి రాజా సాబ్ పార్ట్ 2 సినిమా ఉంటుందనే విషయాన్ని చెప్పకనే తెలియజేశారు మారుతి. దీంతో ఈ విషయం అభిమానులు సైతం తెగ వైరల్ గా చేస్తున్నారు. ఇప్పటికే సీక్వెల్స్ చేస్తున్న హీరోలలో టాప్ లిస్టులో ప్రభాస్ పేరు వినిపిస్తోంది. సలార్ 2, కల్కి 2, రాజా సాబ్ 2 రాబోతున్నాయి. మరి ఈ సీక్వెల్స్ అన్నీ కూడా ఎప్పుడు విడుదలవుతాయో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: